స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ( Star Director Ram Gopal Varma ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే సంగతి తెలిసిందే.ఒకప్పుడు శివలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసి ట్రెండ్ సెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు చెత్త సినిమాలు తీస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ తాజాగా నా పెళ్లాం దెయ్యం( Naa Pellam Deyyam ) అనే టైటిల్ తో కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేశారు.ఇలాంటి సినిమాలతో వర్మ ఏం సాధిస్తారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో తీసిన పొలిటికల్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.వర్మ సినిమాలకు క్రిటిక్స్ నుంచి సైతం నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి.

రామ్ గోపాల్ వర్మ కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా ఆయన శిష్యులు మాత్రం కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో బిజీగా ఉన్నారు.వర్మ శిష్యులు వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ రెమ్యునరేషన్( RGV Remuneration ) కూడా పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.రామ్ గోపాల్ వర్మకు మంచి మూవీ ఆఫర్లు వచ్చినా ఆ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడంలో వర్మ ఫెయిల్ అయ్యారని నెటిజన్ల( Netizens Comments )) నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలు ఎప్పుడు విడుదలవుతున్నాయో కూడా అర్థం కావడం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలకు రామ్ గోపాల్ వర్మ ప్రాధాన్యత ఇవ్వడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రామ్ గోపాల్ వర్మ సినిమాను తెలుగు ప్రేక్షకులే( Telugu Audience ) పట్టించుకోకపోవడంతో ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఈ సినిమాలను అస్సలు పట్టించుకోవడం లేదు.చెత్త సినిమాలను ఎంచుకుంటూ వర్మ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నాడని కామెంట్లు వ్యక్తమవ్తున్నాయి.







