సరికొత్త టెక్నాలజీతో ఎన్-95 మాస్క్...!

ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలందరూ బయటికి వెళ్లే సమయంలో కచ్చితంగా మాస్క్, శానిటైజర్ లను వాడటం పరిపాటిగా మారిపోయింది.వాటిని ఉపయోగించడం దైనందిక జీవితంలో ఓ భాగమైపోయింది.

 N95 Mask With New Technology Ear Phone, N95 Mask, New Technology, Micro Phone,-TeluguStop.com

ముఖ్యంగా మాస్క్ ధరించడం ద్వారా కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందదన్న కారణంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ఉపయోగించడం వారి దినచర్యలో భాగం అయిపోయింది.

అయితే ఇదే క్రమంలో ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక కంపెనీలు విభిన్న రకాలైన మాస్క్ లను తయారు చేసి ప్రజలకు అందిస్తున్నాయి.

ఇందులో భాగంగానే తాజాగా ఒక కంపెనీ కొత్తగా ఆలోచించి కొత్తరకమైన ఎన్ 95 మాస్క్ తయారుచేసి విడుదల చేసింది.ఇక ఈ కొత్తరకం ఎన్ – 95 మాస్క్ విషయానికి వస్తే…

ఈ మాస్క్ ఉపయోగించడం ద్వారా వారు ఫోన్ బయటికి తీయకుండానే కాల్స్ మాట్లాడుకోవడం లేదా పాటలు వినడం లాంటివి చేయవచ్చు.

‘ ది హబుల్ కనెక్టెడ్ ‘ అనే కంపెనీ ఈ కొత్త రకపు మాస్క్ తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసింది.ఈ మాస్క్ ద్వారా పాటలు వినడం, ఫోన్ మాట్లాడటం లాంటివి చేయడానికి కోసం ఈ మాస్ లకు ఇయర్ ఫోన్స్, అలాగే మైక్రోఫోన్ అమర్చబడి ఉన్నాయి.

దీంతో ఈ మాస్కు ధరిస్తేనే అందుకు కనెక్ట్ చేయబడిన ఇయర్ ఫోన్స్ లో చెవిలో పెట్టుకొని మీ పని చేసుకోవచ్చు.ఆ ఇయర్ ఫోన్స్ ను యాప్ ద్వారా ఫోన్ కనెక్ట్ చేసుకోవడం ద్వారా ఫోన్ కు సంబంధించిన కాల్స్… అలాగే ఫోన్ లో ప్లే అయ్యే పాటలను ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా మాట్లాడవచ్చు.

ఇకపోతే ఈ మాస్క్ కు ఒకసారి ఛార్జింగ్ పెడితే దాంతో ఏకంగా 12 గంటల వరకు వీటిని వాడుకోవచ్చు.ఇన్ని విశేషాలు ఉన్న ఈ మాస్క్ ధర కూడా కాస్త ఎక్కువనే చెప్పాలి.

ఈ మాస్క్ ల ధర $49 గా కంపెనీ నిర్ణయం తీసుకుంది.అంటే మన భారత దేశ కరెన్సీ లో రూ.3600 పైనే అనమాట.ప్రస్తుతం ఇంకా భారతదేశంలో ఈ మాస్క్ అందుబాటులో లేదు.

అతి తొందరలో భారత్ లో కూడా విడుదల చేయడానికి కంపెనీ యత్నాలు చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube