మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్( Vasantha Venkata Krishna Prasad ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.మైలవరం క్యాడర్ కు వైసీపీ అధిష్టానమే క్లారిటీ ఇవ్వాలని తెలిపారు.
వచ్చే నెల 4 లేదా 5న ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలను వెల్లడిస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.తన మనోభావాలన్నీ ఆ రోజు చెప్తానని తెలిపారు.వైసీపీ ( YCP )అధిష్టానంపై ఆయన గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం లేదని, సొంత డబ్బుతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇదివరకే కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.