కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు జరుగుతున్న కీలక పరిణామాలతో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న పరిస్థితి ఉంది.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు నివురుగప్పిన నిప్పులా తయారయిన పరిస్థితి ఉంది.
ఇప్పటికే జగ్గారెడ్డి బహిరంగంగా రేవంత్ రెడ్డిని, మాణిక్యం ఠాగూర్ ని, మహేష్ గౌడ్ ని విమర్శించడం ఒక అంశమైతే హనుమంతరావు మంత్రి హరీష్ రావు కలవటం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది.అయితే అధిష్టానం ఒక్కసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు తొలగించిన తరువాత రేవంత్ రెడ్డి జగ్గారెడ్డికి ఝలక్ ఇచ్చానని ప్రచారం చేసి ఢిల్లీకి వెళ్ళడంతో ఇక ఆగ్రహించిన జగ్గారెడ్డి ఇక ప్రెస్ మీట్ నిర్వహించారు.
రేవంత్ రెడ్డి చేస్తున్న రాజకీయం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని, రాజకీయంగా నన్ను తొక్కలేవని, రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డికి నా తడాఖా ఏంటో చూపిస్తానని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి.రాజకీయంగా నాకు కావాలని ప్రాధాన్యత తగ్గించడం వల్లనే నా వాయిస్ ని గట్టిగా వినిపించాల్సి వచ్చిందని నువ్వు చేసిన పని వల్లనే కదా అని రేవంత్ కు సూటిగా సమాధానం ఇచ్చారు.
అంతేకాక జగ్గారెడ్డిని తొక్కాలని చూస్తే కాంగ్రెస్ పార్టీని కూడా తొక్కినట్టేనని ఆ విషయాన్ని మరవకూడదని సరైన సమయంలో జగ్గారెడ్డి అంటే ఏమిటో చూపిస్తానని అది ఏంటనేది ఎలా చేస్తాననేది సరైన సమయంలో తెలుస్తుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.నాతో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వారు మాట్లాడటానికి భయపడుతున్నారని జగ్గారెడ్డి అన్నారు, ఏది ఏమైనా కాంగ్రెస్ లో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ వ్యవహారం రోజురోజుకు కొత్త పుంతకు తొక్కుతూ పార్టీ పరిస్థితి రోజురోజుకు ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితుల్లో రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంది.







