ట్విట్టర్ ఆఫీస్‌కి అద్దె కూడా చెల్లించలేని స్థితిలో మస్క్.. కోర్టులో కేస్ ఫైల్..!

Musk Is Unable To Pay The Rent For The Twitter Office Case File In The Court , Twitter, Twitter Headquarters, Twitter Office, Office Rent, Elon Musk, San Francisco, Letter Of Credit

ఇటీవలే ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ని అధికారికంగా తన సొంతం చేసుకున్నారు.కాగా అప్పటినుంచి ట్విట్టర్ ఆర్థిక కష్టాలతో సతమతమవుతుంది.

 Musk Is Unable To Pay The Rent For The Twitter Office Case File In The Court , T-TeluguStop.com

చివరికి అద్దె కూడా కట్టలేని పరిస్థితి దిగజారిపోయింది. శాన్ ప్రాన్సిస్కోలోని 1355 మార్కెట్ స్ట్రీట్లోని 4,60,000 చదరపు అడుగులలో ఉన్న తన ప్రధాన కార్యాలయానికి కూడా ట్విట్టర్ సంస్థ అద్దె చెల్లించుకోలేకపోతోంది.ఈ కార్యాలయానికి ట్విట్టర్ డిసెంబర్ నెలకిగాను 3.36 మిలియన్ డాలర్లు, జనవరి నెలలో 3.42 మిలియన్ డాలర్లు బాఖీ ఉంది.రెండు నెలల అద్దె ఇప్పటివరకు చెల్లించకపోవడంతో ఆ భవన యజమాని ‘శ్రీ నైన్ మార్కెట్ స్క్వెర్ ఎల్ ఎల్ సీ’ కాలిఫోర్నియా సైట్ కోర్ట్ లో సోమవారం రోజు దావా వేసారు.

Telugu Elon Musk, Letter Credit, San Francisco, Headquarters-Latest News - Telug

అయితే శ్రీ నైన్ మార్కెట్ ట్విట్టర్ కోసం కార్యాలయానికి అద్దెకు ఇచ్చే సమయంలో 3.6 మిలియన్ డాలర్ల ‘లెటర్ అఫ్ క్రెడిట్’ని గ్యారెంటర్‌గా తీసుకుంది.ఒకవేళ ట్విట్టర్ సంస్థ యజమాని మారితే దానిని 10 మిలియన్ డాలర్లకు పెంచేటట్లుగా శ్రీ నైన్ తన దావాలో పొందుపరిచారు.అయితే ట్విట్టర్ రెండు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో శ్రీ నైన్ డిసెంబర్ నెల అద్దె మొత్తాన్ని, జనవరి నెలలో కట్టాల్సిన అద్దెలో సగాన్ని బ్యాంకు నుంచి తీసుకునట్లు తెలిపారు.

ఇక మిగిలిన అద్దె కూడా త్వరలోనే ఇచ్చేయాలని కోర్ట్ తీర్పునిచ్చింది.

Telugu Elon Musk, Letter Credit, San Francisco, Headquarters-Latest News - Telug

ఎలాన్ మాస్క్ ట్విట్టర్ ని సొంతం చేసుకున్నప్పటినుండి ఎన్నో రకాల మార్పులు చేర్పులు చేసారు.ఈ సంస్థ లో పనిచేసే కొంతమంది ఉద్యోగులను కూడా తొలగించారు.పెయిడ్ వర్షన్ ని తీసుకొచ్చారు.

అందుకే వివిధ దేశాలో ట్విట్టర్ కార్యాలయాలకు అద్దె ను చెల్లించడానికి వెనకడుగు వేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube