బ్రౌజింగ్ ఎక్కువగా చేస్తుంటారా.. ఈ తప్పులు చేస్తే రిస్కే..

ఇంటర్నెట్‌ బ్రౌజింగ్ చేయడం ఈ రోజుల్లో అందరికీ అలవాటయింది.అయితే ఈ అలవాటే చాలామంది కొంపముంచుతోంది.

 Do You Do A Lot Of Browsing? If You Do These Mistakes, You Are At Risk Internet-TeluguStop.com

ఎందుకంటే వీరు బ్రౌజింగ్‌ చేస్తున్నప్పుడు తప్పులు చేస్తూ పెద్ద ముప్పులలో పడుతున్నారు.మరి ఆ తప్పులు ఏవి, వాటిని చేయకుండా ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడు చూద్దాం.

బ్రౌజర్ అప్‌డేట్:

బ్రౌజర్‌ను లేటెస్ట్ వెర్షన్‌లకు అప్‌డేట్‌ చేసుకోవడం చాలా ముఖ్యం.ఎందుకంటే పాత వెర్షన్‌లలో సాంకేతిక లోపాలు ఉంటాయి.

వాటిని ఉపయోగించుకొని హ్యాకర్లు మీ డేటాను తిరస్కరించే అవకాశం ఉంది.అలాగే కొత్త వెర్షన్‌లకు అప్‌డేట్‌ చేసుకోవడం ద్వారా కొత్త ఫీచర్లను పొందొచ్చు.

కుకీస్‌ విషయంలో కేర్‌ఫుల్:

ఒక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసినప్పుడు కొన్ని టెంపరరీ ఫైళ్లు ఫోన్ స్టోరేజ్‌లో క్రియేట్ అవుతాయి.వీటినే టెక్నికల్ లాంగ్వేజ్‌లో కుకీస్‌ ​​అంటారు.

కుకీస్‌ వెబ్‌సైట్‌లకు సంబంధించి లాగిన్ వివరాలను కూడా స్టోర్ చేసుకుంటాయి.ఇవి మళ్లీ మనం వెబ్‌సైట్‌ ఓపెన్ చేసినప్పుడు అవి త్వరగా లోడ్ అయ్యేందుకు హెల్ప్ చేస్తాయి.

వీటి వల్ల ముప్పు ఉండదు కానీ చాలా స్టోరేజ్‌ను ఇవి ఆక్రమిస్తాయి.దీనివల్ల మొత్తం డివైజ్‌ స్లో అయ్యే అవకాశం ఉంది.

ప్లగిన్లు:

Telugu Risks, Security Tips, Tips, Password, Security, Public Wifi-Latest News -

గ్రామర్‌ చెకర్స్‌, పాస్‌వర్డ్ మేనేజర్లు, వీడియో డౌన్‌లోడ్‌ల వంటి ప్లగిన్లు చాలా ఉపయోగపడతాయి.అయితే అవసరం లేని ప్లగ్ ఇన్స్‌ వల్ల బ్రౌజర్‌పై భారం ఎక్కువ పడి అది చాలా స్లోగా పనిచేస్తుంది కాబట్టి అనవసరమైన వాటిని డిలీట్ చేసుకోవడం బెటర్.

పబ్లిక్ వైఫైలో వీపీఎన్:

Telugu Risks, Security Tips, Tips, Password, Security, Public Wifi-Latest News -

పబ్లిక్ వైఫై ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ చేయడం చాలా రిస్కీ ఎందుకంటే ఈ సమయంలో హ్యాకర్లు దాడి చేసే అవకాశాలు ఎక్కువ.అందుకే వీపీఎన్‌ ఎనేబుల్ చేసుకోవాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.

లింక్స్ క్లిక్ చేయకూడదు:

భోజనం చేస్తున్నప్పుడు ఏదైనా వెబ్సైట్లో యాడ్స్ కనిపిస్తే వాటిపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.ఎందుకంటే కాకర్లు చాలా తెలివిగా రకాల మార్గాల్లో హానికరమైన లింకుల ద్వారా మోసం చేసే అవకాశం ఉంది.

అవసరమైతే ఫ్రీగా దొరికే మంచి అప్లికేషన్ లేదా సాఫ్ట్‌వేర్ వాడటం మంచిది.

ట్రస్ట్‌బుల్ సైట్లలోనే పేమెంట్స్ చేయాలి:

Telugu Risks, Security Tips, Tips, Password, Security, Public Wifi-Latest News -

పేమెంట్ డీటెయిల్స్ కేవలం ట్రస్ట్‌బుల్ సైట్లలోనే ఎంటర్ చేయాలి.తెలియని సైట్స్‌లో క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం.అంతేకాకుండా, ట్రస్ట్‌బుల్ వెబ్‌సైట్లలోనే ఆన్‌లైన్ షాపింగ్ చేయడం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube