హరికృష్ణ గారిపై ..ఎం.ఎం.కీరవాణి.. కన్నీరు తెప్పించే ట్వీట్.. కారులో వెళ్తున్నప్పుడు ఆయన ఎవరో చెప్పలేదు.

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ మూడో కుమారుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ (61) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే.

నాలుగేళ్ల క్రితం పెద్ద కుమారుడు నందమూరి జానకిరాం విషాదాంతం తరహాలోనే హరికృష్ణను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కర్కశంగా కబళించింది.

బుధవారం ఉదయం 6 గంటలకు ఆయన ప్రయాణిస్తున్న వాహనం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారిపై అన్నెపర్తి వద్ద ఘోర ప్రమాదానికి గురైంది.హాస్పిటల్ కి తరలించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

అప్పటికే ఆయన కన్ను మూసారు.గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు ముగిశాయి.

తెలుగు జాతి గర్వించే మహోన్నత వ్యక్తికి ఆయన కుమారుడు.స్వతహాగా నటుడు.రాజకీయ నాయకుడు.

Advertisement

నేడు ఓ స్టార్ హీరోకి తండ్రి.అయినా ఎక్కడా గర్వం కనిపించదు.

ఎప్పుడూ నిరాడంబరమైన జీవితాన్నే గడిపారు.‘నేను ముఖ్యమంత్రి కుమారుడిని, నా హోదా ఏమిటో తెలుసుకోవాలి’ లాంటి పదజాలం ఆయన ఎప్పుడూ వాడలేదు.

దీనికి ఉదాహరణగా చూపుతూ కీరవాణి ఒక పేపర్ కట్టింగ్‌ను ట్వీట్ చేశారు.

‘భేషజాల్లేని మనిషి.’ అనే శీర్షికతో ఉన్న ఆ కట్టింగ్‌లో ‘ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒక రోజు హైదరాబాద్‌లో హరికృష్ణ కారులో వెళుతున్నారు.ముషీరాబాద్‌లో ట్రాఫిక్ సిగ్నల్ దాటారన్న కారణంతో ఓ పోలీసు ఆయనను ఆపి చలానా రాశారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

హరికృష్ణ తాను ఎవరో చెప్పకుండా.చలానా కట్టే ముందుకు వెళ్లారు’ అని రాసి ఉంది.

Advertisement

కీరవాణి ఈ క్లిప్పింగ్‌ను ఎక్కడ సేకరించాలరో తెలీదు కానీ.హరికృష్ణ ఔన్నత్యా్న్ని చాటడానికి ఇదీ ఒక ఉదాహరణగా మిగిలింది.

తాజా వార్తలు