చక్రి అన్నయ్య చివరి కోరిక అదే... ఆ కోరిక నెరవేర్చినందుకు సంతోషంగా ఉంది: మహిత్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చక్రి(Chakri) మరణం వార్త ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన చక్రి 2014వ సంవత్సరంలో గుండెపోటుకు గురై మరణించారు.

 Music Director Chakri Brother Mahit Narayan Emotional About Fulfilling His Last-TeluguStop.com

అయితే మరణం తర్వాత వీరి కుటుంబంలో ఎన్నో వివాదాలు చోటుచేసుకున్నాయి.ఇకపోతే చక్రి మరణం అనంతరం ఆయన వారసుడిగా తన తమ్ముడు మహిత్(Mahith) ఇండస్ట్రీలోకి సంగీత దర్శకుడిగా అడుగు పెట్టారు.

ఇలా పలు సినిమాలకు సంగీతం అందించిన మహిత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మహిత్ మాట్లాడుతూ తన అన్నయ్య చక్రి గురించి పలు విషయాలు తెలియజేశారు.ఈ సందర్భంగా మహిత్ మాట్లాడుతూ అన్నయ్య ఉన్నప్పుడు మాకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు.అయితే అన్నయ్య మరణం తర్వాత ఎన్నో ఇబ్బందులు చుట్టుముట్టాయని, ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నామని ఈయన తెలియచేశారు.

ప్రస్తుతం తాను ఒక స్టూడియో ఏర్పాటు చేసి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు.ఈ స్టూడియో పెట్టడం అన్నయ్య చక్రి కల అని మహిత్ తెలియజేశారు.ఎప్పటికైనా ‘c’ స్టూడియో (C Studio) పెట్టాలని భావించారు.కానీ అది నెరవేరలేదు అయితే అన్నయ్య చివరి కోరికను తాను నెరవేర్చానని మహిత్ తెలిపారు.

అన్నయ్య కోరిక మేరకే తాను స్టూడియో నిర్మించి దానికి C స్టూడియోస్ అనే పేరును కూడా పెట్టానని తెలిపారు. సీ- అంటే చిరంజీవి(Chiranjeevi) అని అర్థం.అన్న చక్రికి చిరంజీవి అంటే చాలా ఇష్టం.స్ఫూర్తి కూడానూ.అందుకే ఆయన కోరిక మేరకు ఈ స్టూడియో పెట్టాను.ఇలా అన్నయ్య చివరి కోరికను తీర్చినందుకు సంతోషంగా ఉందని అయితే అన్నయ్య లేని లోటు ఇప్పటికి తమని ఎంతగానో కృంగతీస్తుంది అంటూ ఈ సందర్భంగా మహిత్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube