తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు పెద్ద ఎత్తున కీలక మలుపులు తిరుగుతూ హీటెక్కుతున్న పరిస్థితి ఉంది.అయితే బీజేపీ పార్టీ రోజురోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే కేసీఆర్ తో విభేదించి బీజేపీ పార్టీలో చేరి మరల ఎమ్మెల్యే గా గెలుపొందిన విషయం తెలిసిందే.అయితే బీజేపీలో చేరిన మొదట్లో కొంత హాట్ టాపిక్ గా మారినా రాను రాను కొంత సైలెంట్ గా మారిన పరిస్థితి ఉంది.
అయితే వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలని బీజేపీ పెద్ద ఎత్తున భావిస్తున్న తరుణంలో ఇక టీఆర్ఎస్ టార్గెట్ గా మారిన ప్రతి వారు బీజేపీలోకి వెళ్లాలని పెద్ద ఎత్తున భావించడం లాంటి పరిస్థితులను మనం చూస్తున్నాం.అయితే ఈటెలతో పాటు చేరిన క్రింది స్థాయి నేతలకు తగినంతగా గుర్తింపు ఉండటం లేదని భావిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే తాజాగా బీజేపీలో ప్రకటించిన పార్టీ పదవులలో ఈటెల క్యాడర్ కు అంతగా ప్రాధాన్యత దక్కకపోవడంతో ఈటెల దగ్గర తమ అసంతృప్తిని వ్యక్తం చేశారట.అయితే ఈటెలకు బీజేపీ హైకమాండ్ దగ్గర గుర్తింపు ఉన్నా మొదట్లో ఉన్నంత ప్రాధాన్యత అనేది ఈటెలకు బీజేపీ దక్కడం లేదని స్వంత క్యాడర్ మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది.
అయితే ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది రానున్న రోజుల్లో బీజేపీ జరిగే పరిణామాలను బట్టి తెలిసే అవకాశం ఉంది.అయితే ప్రస్తుతం ఈటెల ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అసంతృప్తి నేతలను బీజేపీలోకి తీసుకరావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న తరుణంలో ఒకవేళ బీజేపీలో చేరితే టీఆర్ఎస్ కు భారీ షాక్ తగులుతుందని చెప్పవచ్చు.
ఏది ఏమైనా రానున్న రోజుల్లో ఈటెల వర్గానికి ఎంత మేరకు ప్రాధాన్యత దక్కుతుందనేది చూడాల్సి ఉంది.