ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ప్రతిపక్ష టీడీపీ ( TDP )అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించింది.
దీంతో పలు జిల్లాల్లో అసంతృప్త జ్వాలలు చెలరేగుతున్నాయి.ఈ క్రమంలోనే పార్టీ క్యాడర్ నిరసనలు చేస్తుండగా.
కీలక నేతలు రాజీనామాల బాట పట్టారు.ఇప్పటికే పలువురు నాయకులు టీడీపీని వీడగా మరి కొందరు పార్టీని వీడేందుకు సమాయత్తం అవుతున్నారు.
విజయనగరం జిల్లాలోని టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది.చీపురుపల్లి నియోజకవర్గ టికెట్ ( Chipurupalli Constituency Ticket )ను ఆశించి భంగపడిన కిమిడి నాగార్జున పార్టీని వీడారు.ఈ క్రమంలోనే పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్ష పదవితో పాటు చీపురుపల్లి ఇంఛార్జ్ పదవికి కూడా రాజీనామా చేశారు.మరోవైపు కిమిడి నాగార్జునను కాదని అధిష్టానం టికెట్ ను కళా వెంకట్రావుకు కేటాయించడంపై పార్టీ క్యాడర్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
అనంతరం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ ప్రచార సామాగ్రితో పాటు ఫ్లెక్సీలు, బ్యానర్లను దగ్ధం చేశారు.అదేవిధంగా జిల్లాలోని పోలిపల్లిలోనూ టీడీపీ శ్రేణులు పార్టీ హైకమాండ్ పై అసంతృప్తిగా ఉన్నారు.
నెల్లిమర్ల ఇంఛార్జ్ కర్రోతు బంగార్రాజుకు( Karrothu Bangarraju ) చంద్రబాబు తీరని అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలోనే భవిష్యత్ కార్యాచరణ కోసం పార్టీ కార్యకర్తలు విస్తృత సమావేశం నిర్వహించారు.
అంతేకాకుండా మొత్తం నాలుగు మండలాలకు చెందిన టీడీపీ అధ్యక్షులు పార్టీ పదవులకు రాజీనామా చేశారని సమాచారం.

అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలోనూ టీడీపీ నిరసనలు కొనసాగుతున్నాయి.చంద్రబాబు( Chandrababu ) రూ.150 కోట్లు తీసుకుని నియోజకవర్గ నేతలను కాదని పక్క నియోజకవర్గ నాయకులకు టికెట్ కేటాయించారని ఆరోపిస్తున్నారు.పార్టీ కోసం ఎంతో కష్టపడిన మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్( Former MLA Jitendra Goud ) ను కాదని.ఇటీవల వైసీపీ నుంచి వచ్చిన గుమ్మనూరు జయరాంకు టికెట్ ఇవ్వడంపై పార్టీ క్యాడర్ మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు ఫోటోతో పాటు పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను మంటల్లో వేసి కాల్చి బూడిద చేశారు.

మరోవైపు నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి( Senior leader Katamreddy Vishnuvardhan Reddy ) కూడా టీడీపీకి రాజీనామా చేశారు.ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించారు.అయితే, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధిష్టానంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
పార్టీ కోసం కష్టపడి ఇన్నేళ్లుగా పని చేసిన వారిని పక్కన పెట్టడంపై నేతలు తీవ్ర అసహానం వ్యక్తం చేస్తున్నారు.పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటూ సీట్ల కేటాయింపులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇంతకాలం పార్టీ కోసం పడిన కష్టాన్ని చంద్రబాబు వృధా చేశారని ఆవేదన చెందుతున్నారు.ఈ క్రమంలోనే ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.