స్పైడర్ సినిమా ఆపేద్దాం అన్న మురుగదాస్

ఎప్పుడో గతేడాది జులైలో మొదలుపెట్టారు స్పైడర్.దాదాపుగా పది నెలలు.

కాని ఇంతవరకు సినిమా షూటింగ్ పూర్తవలేదు.

ఇప్పట్లో అయ్యే సూచనలు కూడా లేవు.

సినిమా జూన్ 23న విడుదల అవడం కష్టమని, వాయిదా పడటం ఖాయమని వార్తలొస్తున్నాయి.ఇక మాదాక వచ్చిన సమాచారం ప్రకారం మహేష్ సినిమా ఔట్ పుట్ మీద సంతృప్తిగా లేడట.

యాక్షన్స్ ఎపిసోడ్లు బాగా వచ్చినప్పటికి, టాకీ పార్ట్ చాలావరకు మహేష్ కి నచ్చలేదు.కాని మహేష్ దర్శకుడి మీద నమ్మకంతో షూటింగ్లో పాల్గొంటూ వచ్చాడు.

Advertisement

మహేష్ అసంతృప్తిని, మొహమాటాన్ని గమనించిన మురుగదాస్, సార్ సినిమా ఆపెద్దామా అని అడిగారట.అయితే అప్పటికే కోట్లు కుమ్మరించారు నిర్మాతలు.

సినిమా మధ్యలో ఆపేస్తే కోట్ల నష్టం.అసలే విన్నర్, మిస్టర్ నష్టాల్లో ఉన్నారు ఠాగూర్ మధు.అందుకే ప్రాజెక్టుని క్యాన్సల్ చేసే బదులు, బడ్జెట్ కొద్దిగా అదుపు తప్పినా, సంతృప్తిగా లేని సీన్లని మళ్ళీ తీద్దామని మహేష్ సజెస్ట్ చేసాడట ప్రిన్స్‌.దానికి నిర్మాతలు కడా ఒప్పుకోవడంతో రీషూట్ ప్లాన్ చేసారు.

ఒకటి కాదు రెండు కాదు, 35 రోజుల పాటు రీషూట్ ఉంటుందట.దీన్నిబట్టి మీరే అర్థం చేసుకోండి, సినిమా ఎలా వస్తోందో! అందుకే స్పైడర్ జూన్ బరిలోంచి తప్పుకునేలా ఉంది.

అటుచేసి ఇటుచేసి శ్రీమంతుడు వచ్చిన ఆగష్టులోనే ఈ సినిమా కుడా విడుదల చేసేలా ఉన్నారు.లేట్ అయితే అయ్యింది కాని, రీషూట్ అయినా బగా ప్లాన్ చేసుకోని, మంచి ఔట్ పుట్ వచ్చేలా తీస్తే చాలు.

Pokiri : పోకిరి సినిమా ఎందుకు ఆడిందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు
Advertisement

తాజా వార్తలు