గజిని సీక్వెల్ ఆలోచనలో మురగదాస్.. హీరో సూర్యానేనా.. లేక?

కోలీవుడ్ నటుడు సూర్య మురగదాస్ కాంబినేషన్లో వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం గజినీ.

ఈ సినిమా అప్పట్లో సౌత్ ఇండియ ఎలా షేక్ చేసిందో మనకు తెలిసిందే.

ఇలా సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఈ సినిమా ద్వారా సూర్యకు తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులు పెరిగిపోయారు.ఎంతోమంది హీరోలు రిజెక్ట్ చేసిన ఈ సినిమాని సూర్య చేసి హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ సినిమా విడుదలై దాదాపు 14 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఈ సినిమా ఇష్టపడే వారు ఎంతో మంది ఉన్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదలై 14 సంవత్సరాల అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గజిని సినిమా ద్వారా తన మార్క్ చూపించిన మురగదాస్ ఈ సినిమా సీక్వెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయ్యాయని త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందనే వార్త నెట్టింట వైరల్ అయింది.

Advertisement

ఇక గజిని సినిమా సీక్వెల్ రాబోతుందని తెలియడంతో ఎంతోమంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ సీక్వెల్ చిత్రంలో హీరోగా సూర్య నటిస్తారా లేక మురగదాస్ మరెవరినైనా సంప్రదిస్తారా అనే విషయంపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే గజిని సినిమాలో సూర్య తప్ప ఏ ఇతర హీరోలను ఊహించుకోలేమని ఈ సినిమాకి సూర్య పర్ఫెక్ట్ గా సరిపోతారంటూ అభిమానులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ విధంగా గజని సీక్వెల్ చిత్రానికి మెల్లిగా అడుగులు పడుతున్నాయని త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు