పాముకి ముద్దుపెడుతూ ప్రమాదం కొనితెచ్చుకున్నాడు

ఇతని పేరు సోమ్ నాథ్.ముంబైకి చెందిన ఇతడు పాములను అవలీలగా పట్టేస్తాడు.

 Mumbai Man Dies Bitten When Tried To Kiss A Snake-TeluguStop.com

జనసంద్రంలోకి వచ్చి ప్రాణాలమీదకి తెచ్చుకునే పాములని రక్షిస్తాడు.ఇప్పటివరకు బాగానే ఉంది కాని ఇతనికో ప్రమాదకరమైన అలవాటు ఉంది.

అదేంటంటే, తాను పట్టుకున్న పాములను ముద్దుపెట్టుకుంటూ ఫోటోలకు ఫోజులివ్వడం.ఇప్పుడు ఈ అలవాటే ప్రాణాలు తీసింది.

వివారాల్లోకి వెళితే, బేలాపూర్ లో, ఓ కారులో చిక్కుకున్న పాముని పట్డుకున్నాడు సోమ్ నాథ్.ఆ పాముని తీసుకోని మరో చోటుకి ఫోటోగ్రాఫర్స్ తో బయలుదేరాడు.

అక్కడ ఈ చిత్రంలో కనిపిస్తున్నట్లుగా పాము తలపై ముద్దులుపెడుతూ ఫోటోలకు ఫోజులివ్వడం మొదలుపెట్టాడు.

అయితే ఈ సర్పం మిగితా పాముల్లా కాకుండా, వెనక్కి తిరిగి అతని ఛాతిపై గాటు వేసింది.

అంతే, కాసేపటికి ప్రాణాలు వదిలేశాడు.ఈ సంఘటనపై జంతు సంరక్షణ సంఘాలు తమ నిరసనను వ్యక్తం చేసాయి.

ఇలా ఫోటోల కోసం జంతువులతో ఆటలాడే వారిపై కఠిన చర్యలు ఇకనుంచైనా తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు తప్పుతాయని ఫారెస్ట్ డిపార్టుమెంటుని అర్థిస్తున్నారు అనిమల్ ఆక్టివిస్ట్స్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube