ఆ హీరోయిన్లు అలాంటి పనులు చేస్తున్నారు.. ఎమోషనల్ అయిన ముమైత్..?

ఒకప్పుడు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది.అయితే కాలం మారే కొద్దీ ఐటెమ్ సాంగ్స్ కు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది.

 Actress Mumaith Khan Shocking  Comments About Star Heroine Item Songs , Item Son-TeluguStop.com

ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లు ఐటెం సాంగ్స్ కు బదులుగా స్పెషల్ సాంగ్స్ ను చిత్రీకరిస్తూ ఆ పాటల కోసం స్టార్ హీరోయిన్లనే తీసుకుంటున్నారు.అయితే హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చేస్తుండటం గురించి ముమైత్ ఖాన్ మండిపడటంతో పాటు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఒకప్పుడు వరుసగా సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసిన ముమైత్ ఖాన్ కు తర్వాత రోజుల్లో ఆఫర్లు తగ్గాయి.ప్రస్తుతం ముమైత్ ఖాన్ స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న డ్యాన్స్ ప్లస్ అనే షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 1లో ముమైత్ ఖాన్ పాల్గొన్న నేపథ్యంలో స్టార్ మా ఛానెల్ లోని ప్రోగ్రామ్స్ లో పాల్గొనడానికి ముమైత్ ఖాన్ కు అవకాశాలు వస్తున్నాయి.తాజాగా ఒక సందర్భంలో ముమైత్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనకు సిల్క్ స్మిత అంటే ఎంతో అభిమానమని ఆ అభిమానం వల్లే తాను నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానని ముమైత్ ఖాన్ అన్నారు.

Telugu Dance Judge, Item, Mumaith Khan, Mumaithkhan, Popular, Heroinesm, Maa-Mov

అయితే తాను ఐటెం సాంగ్స్ చేసిన సమయంలో తనపై కొంతమంది తీవ్రంగా విమర్శలు చేశారని ముమైత్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా గుర్తింపును సంపాదించుకున్న వాళ్లు సైతం ఐటెం సాంగ్స్ చేస్తున్నారని ఆమె విమర్శలు చేశారు.

తాను ఐటెం సాంగ్స్ చేసిన సమయంలో విమర్శలు చేసిన వాళ్లు ఇప్పుడు మాత్రం స్టార్ హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నారని ఆమె చెప్పారు.

ముమైత్ చేసిన కామెంట్లపై స్టార్ హీరోయిన్లు ఎవరైనా స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.ముమైత్ ఖాన్ కు గత కొన్నేళ్ల నుంచి సినిమా ఆఫర్లు అస్సలు రావడం లేదనే సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube