బెంజ్ కారుకో న్యాయం.. లారీకో న్యాయమా - ములుగు ఎమ్మెల్యే సీతక్క

బెంజ్ కారు కో న్యాయం,లారీ కో న్యాయమా.ఆ రోజు లారీ‌లో జరిగిన హత్యచారం కేస్ లో ఎన్ కౌంటర్ చేశారు.

బెంజ్ కార్ కేస్ లో నిందుతులను రక్షించే ప్రయత్నం ఈ టి.ఆర్.ఎస్.ప్రభుత్వం చేస్తుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో రెవెన్యూ భూములపై చట్టపరమైన సమస్యలు, పరిష్కారాలకు సంబంధించి అవగాహన సదస్సు కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గోన్నారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం నిరుపేదలకు భూములిస్తే అదే భూములను తెలంగాణ ప్రభుత్వం వైకుంఠదామాలు , హరితవనాల పేరుతో భూములు వెనక్కు లాక్కుంటుందని , దీనికి ప్రజలే తగిన బుద్ధిచెప్పాలన్నారు.ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఆడవాళ్లకు రక్షణ లేదు, సామాన్యులకు కూడా రక్షణ లేదు కేవలం కబ్జా కోరులకు అధికార యంత్రాంగానికి దగ్గర ఉండే వాళ్లకు తారుమారు చేసే శక్తి ఉన్నటువంటి అధికార పార్టీ నేతలకు తప్ప సామాన్యులకు న్యాయం లేకుండా పోయింది ఈ టి.ఆర్.ఎస్ ప్రభుత్వం లో అని మండిపడ్డారు.దాదాపుగా పది రోజులు దాటి పోతుంది బెంజ్ కార్ లో జరిగినటువంటి అత్యాచారం గురించి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నిందితులను పట్టుకోకుండా దాచిపెట్టి అటువంటి ప్రయత్నం చేశారు .ఎవరైతే తప్పు చేశారో వారిని శిక్షిస్తే రేపు తప్పు చేసేవారికి శిక్షిస్తారు అని భయం నుండి నేరాలు చేయడం తగ్గుతుంది పోలీసు వ్యవస్థ అందరికీ ఒకప్పటి ఉన్నటువంటి గౌరవం లేకుండా ఎమ్మెల్యేలకు కార్పొరేటర్లకు ఎస్కార్ట్ గా పని చేయవలసి వస్తుంది తప్ప వాళ్ళ డ్యూటిని సక్రమంగా చెయ్యనికుండా చేస్తుంది ఈ ప్రభుత్వం.పోలీసులు అందరూ కూడా తిరగబడాలి మీ డ్యూటీ ఏంటి మీరు ఏంటి అని చెప్పేసి నిలదీయాలి అప్పడే ప్రజల్లో పోలీసులకు గౌరవం ఉంటుందని అన్నారు.

సామాన్య ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు పబ్బులు క్లబ్బుల్లో అన్నీ యదేచ్చగా కొనసాగుతున్నాయి.పబ్బుల్లో మైనర్లకు అవకాశం లేదు అయినా మైనర్లకు అవకాశం ఇస్తున్నప్పుడు పోలీసు యంత్రాంగం కానీ చట్టం కానీ వాటి లైసెన్స్ లను రద్దు చేయాలి,రాజకీయ నాయకులకు ఎస్కార్ట్ గా పని చేస్తూ చోద్యం చూస్తున్నారు పోలీసులు అని అన్నారు.

Advertisement

బెంజ్ కారు కో న్యాయం,లారీ కో న్యాయమా.ఆ రోజు లారీ‌లో జరిగిన హత్యచారం కేస్ లో ఎన్ కౌంటర్ చేశారు.బెంజ్ కార్ కేస్ లో నిందుతులను రక్షించే ప్రయత్నం చేస్తుంది ఈ కేసిఆర్ ప్రభుత్వం.

తమ డ్యూటీ సరిగ్గా చేసి సమాజంతోటి సెల్యూట్ కొట్టించుకోండి అన్నారు.

Advertisement

తాజా వార్తలు