భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ములుగు ఏంఎల్ఏ సీతక్క పోరాటం ప్రారంభించారు

BTPS రైల్వే లైన్ భూనిర్వాసితులను పరామర్శించి అండగా ఉంటామంటు హామీనిచ్చారు, ఈ సంధర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పినపాక నియోజకవర్గంలో సీతక్క తన మార్కు చూపిస్తున్నారు, అవకాశం దొరికినప్పుడల్లా నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై పోరాటం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు, రెండు రోజుల క్రితం మణుగూరు మండలం రామానుజవరంలో బిటిపిఎస్ రైల్వే లైన్ భూనిర్వాసితులు చేస్తున్న ఆందోళనకు ఆమె మద్దతు ప్రకటిస్తూ మంగళవారం సాయంత్రం భాదితులను పరామర్శించారు, ఈ సందర్భంగా రాష్ట్రంలో కొందరు అధికారులు ప్రజల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారంటు ఆరోపించారు, ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారంటు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్నో ఏళ్లుగా ఈ భూములనే నమ్ముకుని బ్రతుకుతున్నామంటు భూనిర్వాసితులు సీతక్క ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు, దీంతో నిర్వాసితుల సమస్యలపై మాట్లాడేందుకు భద్రాద్రి జిల్లా జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లుకు పోన్ చేసిన సీతక్క ఆయన మాట్లాడిన విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, ఏంఎల్ఏ తో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా అంటూ సీరియస్ అయ్యారు.10 వేల రూపాయల పరిహారం ఇచ్చి భూములు ఎలా తీసుకుంటారంటూ నిలదీశారు, అదే మీ భూములకు ఐతే ఇలా పరిహారం చెల్లిస్తే ఇస్తారా అంటూ ప్రశ్నించారు, ఈ సదర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుని తప్పుబట్టారు, రాష్ట్రంలో కొందరు అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటు సంచలన వ్యాఖ్యలు చేశారు, అధికారుల వ్యవహారశైలి చూస్తుంటే అసహ్యం వేస్తుందన్నారు, సలాం కొట్టుకుంటూ బ్రతుకుతున్నారు ఎందుకు ఆ బ్రతుకు అంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులను ఒప్పించి భూములు తీసుకోవాలి కానీ లాఠీఛార్జిలు చేసి భయపెట్టి కాదంటూ హితవు పలికారు, మణుగూరు మండలం రామానుజవరంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ రైల్వేలైన్ భూ నిర్వాసితులు చేస్తున్న పోరాటానికి తాను అండగా ఉంటానంటు హామీనిచ్చారు.

" autoplay>

తాజా వార్తలు