ములుగు శాసనసభ సభ్యరాలు సీతక్క మరోసారి చిన్నజీయర్ స్వామి పై మండిపడ్డారు.ఆదివాసీలతో పాటు కోట్లాదిమంది ఆరాధించే వనదేవతలను చినజీయర్ స్వామి కించపరిచేలా మాటడటం బాధాకరం అన్నారు.
గిరిజన జాతరలు అంటేనే ప్రకృతితో మమేకమై జరుపుకుంటారని.అలవాట్లు ఆచార.
సంప్రదాయాలను బట్టి ఎవరిని చులకనచేసి మాట్లాడవద్దు అన్నారు.
తప్పుడు మాటలు మాట్లాడారని అందరుగుర్తించారు ఆత్మపరిశీలన చేసుకొని చినజీయర్ స్వామి ఇప్పటికైన పరివర్తనం చెంది తప్పకుండా ఆదివాసీ వనదేవతలకు క్షమాపన చెప్పాలని డిమాండ్ చేస్తూ.
రాష్ట్రంలోఇంత జరుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని స్పందించకపోవడం అత్యంత బాధాకరం అన్నారు.