సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సినిమాలో భాగంగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినప్పుడు అనుకోకుండా కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు హీరో హీరోయిన్లు అనుకోకుండా ఆ ప్రమాదం బారిన పడుతూ ఉంటారు.
ఇటీవల కూడా ఒక తెలుగు హీరోయిన్ కారు ప్రమాదానికి గురైంది.అయితే ఆ ప్రమాదంలో ఆమె ఆల్మోస్ట్ వీల్ చైర్ లో కూర్చునే పరిస్థితి కూడా వచ్చిందట.
ఆ హీరోయిన్ ఎవరు అసలేం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.దర్శకుడు గంగాధర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, అయేషా ఖాన్ నటించిన తాజా చిత్రం ముఖచిత్రం.
ఈ డిసెంబర్ 9న అనగా నేడు విడుదల కాబోతోంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు.ఇది మామూలుగా ప్రమోషన్స్ సమయంలో సినిమాలో సినిమా కోసం వారి పడ్డ కష్టం గురించి సినిమాల్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ల గురించి చెబుతూ ఉంటారు.ఈ క్రమంలోనే ఈ సినిమాకి కథ అందించిన కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్ రాజ్, దర్శకుడు గంగాధర్ ఈ సినిమా కోసం హీరోయిన్ పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చారు.
ముఖ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించారు.అందులో ఒక హీరోయిన్ అయేషా ఖాన్.
ముఖచిత్రం సినిమాలో ఒక కార్ యాక్సిడెంట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో హీరోయిన్ కి గాయాలు అయ్యాయట.
అనుభవం లేకపోవడం వల్ల అయేషా సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయలేకపోయిందని డైరెక్టర్ తెలిపారు.

దాంతో ఆ ప్రమాదంలో ఆమె నడుము, వెన్ను భాగంలో తీవ్ర గాయం అయ్యిందని అన్నారు.అయితే అయేషా తక్కువ బరువు ఉండడం వల్ల గాయం నుంచి త్వరగా కోలుకోగలిగిందని, కొంచెం బరువు ఉంటే జీవితాంతం ఆమె వీల్ చైర్ లోనే కూర్చోవాల్సి వచ్చేదని దర్శకుడు గంగాధర్, సందీప్ రాజ్ వెల్లడించారు.ఈ సినిమాలో ఆమె బాగా నటించిందని ఆమెకి ఫ్యూచర్ లో మంచి మంచి అవకాశాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు గంగాధర్ సందీప్ రాజ్.అయితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగిందట.
ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న కూడా ఇప్పటివరకు ఈ విషయాన్ని బయట ఎవరికీ తెలియదు.ఈ ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.







