దశాబ్దాల తరువాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి ముద్రగడ??

కాపుల సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు చేసిన ముద్రగడపై( Mudragada Padmanabham ) ఆ సామాజిక వర్గంలో అభిమానం ఉంది.కాపుల రిసర్వేషన్ కోసం ఆయన అనేక ఉద్యమాలు కూడా చేశారు .

అయితే వ్యూహాత్మకంగా ఉద్యమాలు నడపడంలో విఫలమైన ఆయన తుని రైల్వే సంఘటన తో ఆయనతో పాటు మొత్తం కాపు సామాజిక వర్గానికి చెడ్డ పేరు తీసుకొచ్చారు.దీంతో ఆయన నాయకత్వం పై కూడా విమర్శలు వచ్చాయి.

అయితే చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చాలా పార్టీలు ఆయనను ఆహ్వానిస్తున్నప్పటికీ రైల్వే కేసులు తేలే వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకూడదని భావించిన ఆయనకు రైల్వే కోర్టు ఆ కేసులు కొట్టివేయడంతో ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాదానికి మార్గం సుగమమైంది .

Telugu Ap, Chandra Babu, Kapu, Ys Jagan-Telugu Top Posts

ఆయన చాలాకాలంగా వైసీపీ కి అనుకూలంగా ఉంటున్నారు అన్న వార్తలను నిజం చేస్తూ ఆయన వైసీపీ పార్టీ నుంచే పోటీ చేయాలని చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి తన కుమారుడికి పిఠాపురం ఎమ్మెల్యే సీటును తనకు కాకినాడ ఎంపీ సీటును వైసీపీ పార్టీ నుంచి హామీగా ఆయన పొందారని తెలుస్తుంది .

Telugu Ap, Chandra Babu, Kapu, Ys Jagan-Telugu Top Posts

తమ కుటుంబ ప్రయోజనాల కోసమే కాపు రిజర్వేషన్లపై జగన్ ప్రభుత్వం( YS Jagan Mohan Reddy ) వెనకడుగు వేసినా కూడా ముద్రగడ పట్టించుకోవడం లేదంటూ ఆయనపై అనేక విమర్శలు కూడా వచ్చాయి .చంద్రబాబు నాయుడు హయాం ( Chandra babu naidu )లో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పై తీవ్ర స్థాయి వ్యతిరేకత చూపుతూ ఆందోళనలు చేస్తూ బహిరంగ లేఖలు విడుదల చేసిన ముద్రగడ ,జగన్ ప్రభుత్వం అనేక ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కనీస స్పందన కూడా చూపించడం లేదని తెలుగుదేశం శ్రేణులు ఆయనపై విమర్శలు చేస్తూ ఉంటాయి .

Telugu Ap, Chandra Babu, Kapu, Ys Jagan-Telugu Top Posts

ఏదేమైనా కాపు సామాజిక వర్గంలో బలమైన మద్దతు కలిగిన ఈయన వైసీపీలో చేరితే ఆ పార్టీకి ఉదయ గోదావరి జిల్లాలో బలం పెరిగినట్లే పరిగణించవచ్చు .ఈయనకు ఉన్న ప్రాధాన్యత రీత్యా ఈయన కోరుకున్న సీటు ఇవ్వడానికి….వైసీపీ పార్టీ కూడా సిద్ధంగా ఉన్నదని వార్తలు వస్తున్నాయి…ఆ .అంచనాల నిజమై ఎంపీ సీటుకి ఈయన పోటీ చేస్తే మాత్రం దాదాపు రెండూ దశాబ్దాల తర్వాత మరొకసారి ప్రత్యక్ష ఎన్నికలలో తన అదృష్టం పరీక్షించుకున్నట్టుగా అవుతుంది.మరి కొన్ని రోజుల్లో ఆయన రాజకీయ ప్రవేశంపై సస్పెన్స్ కు తేరబడే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube