వీధి రౌడీలా మాట్లాడతారా ? పవన్ కు ముద్రగడ కౌంటర్ 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) కు కాకు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ మ కౌంటర్ ఇచ్చారు.పవన్ చేపట్టిన వారాహి యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది.

 Mudragada Padmanabam Comments On Pawan Kalyan , Pavan Kalyan, Telugudesam, Ysr-TeluguStop.com

ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం ను ఉద్దేశించి పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసి రాజకీయంగా ఎదుగుతున్నారు అంటూ పరోక్షంగా ముద్రగడ అంశాన్ని పవన్ ప్రస్తావించడంతో, దీనికి అంతే స్థాయిలో ముద్రగడ పద్మనాభం పవన్ కు కౌంటర్ ఇచ్చారు.” నేను కులాన్ని అడ్డుపెట్టుకుని నాయకుడిగా ఎదగలేదు.నేను యువతను వాడుకొని భావోద్వేగాలు రెచ్చగొట్టలేదు.

ప్రభుత్వం మారినప్పుడల్లా నేను ఉద్యమాలు చేయలేదు.చంద్రబాబునాయు( Chandrababu naidu )డు ద్వారా పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ ను పునరుద్ధరిస్తానని పదేపదే చెప్పడం వల్ల రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి బాబు ద్వారా పవన్ కల్పించారు ‘ అంటూ ముద్రగడ వ్యాఖ్యానించారు.

నాకంటే చాలా బలవంతుడైన పవన్ నేను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి యువతకు రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని ముద్రగడ ప్రశ్నించారు .

Telugu Ap, Chandrababu, Kapu, Pavan Kalyan, Telugudesam, Ysrcp-Politics

జగ్గంపేట సభలో రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలోనిది అని జగన్ ( YS Jagan Mohan Reddy )అన్నప్పుడు నేను ఇచ్చిన సమాధానం ఏమిటో అడిగి తెలుసుకోవాలని పవన్ కు సూచించారు.పార్టీ పెట్టిన తర్వాత పదిమందితో ప్రేమించబడేలా ఉండాలని,  వీధి రౌడీలా మాట్లాడడం ఎంతవరకు సబబు అంటూ పవన్ ను ముద్రగడ ప్రశ్నించారు.మీ ప్రసంగాలలో తాటతీస్తా,  నార తీస్తా, గుండు చేయిస్తా,  కింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా అంటూ పదేపదే అంటున్నారని, ఇప్పటి వరకు ఎంతమందిని ఇలా  చేశారో చెప్పాలని ముద్రగడ ప్రశ్నించారు.

ఎమ్మెల్యేలను తిట్టడం కోసం సమయాన్ని వృధా చేసుకోవద్దని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై పవన్ చేసిన ఆరోపణల అంశాన్ని ముద్రగడ ప్రస్తావించారు.

Telugu Ap, Chandrababu, Kapu, Pavan Kalyan, Telugudesam, Ysrcp-Politics

 దమ్ముంటే ఆయనపై పోటీ చేసి గెలవాలని సూచించారు.తనను ముఖ్యమంత్రి చేయాలని పవన్ ఎలా అడుగుతారని ముద్రగడ ప్రశ్నించారు.175 సీట్లకు పోటీ చేస్తే సీఎం చేయాలని అడగాలి తప్ప , బీజేపీ ,టిడిపితో పొత్తు పెట్టుకుంటానని చెబుతూ తనను సీఎం చేయమని ఎలా అడుగుతారని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube