జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ( Pawan Kalyan ) కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) ఘాటు లేఖ రాశారు.రెండు సార్లు కిర్లంపూడికి వస్తానని కబురు పంపారు.
ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగింది.అన్ని వర్గాలకు న్యాయం చేయాలని భావించి మీతో కలిసి సేవ చేయాలనుకున్నాను.
కానీ మరు నన్ను కలవడానికి వస్తానని చెప్పి రాలేకపోయారన్నారు.మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవన్న ముద్రగడ.
ఎన్నో చోట్ల అనుమతులు అవసరమంటూ ఎద్దేవా చేశారు.పవర్ షేరింగ్( Power Sharing ) అనేది లేదని అర్థం అయిందని తెలిపారు.
తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గాని, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం చేయలేదని తెలిపారు.

అలాగే మీలా గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజల్లో పరిపతి లేనివాడిని కావడం వలన మీ దృష్టిలో లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా, తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడిగా గుర్తింపు పడడం వలనే మీరు వస్తానని చెప్పించి రాలేకపోయారని ముద్రగడ లేఖలో( Mudragada Letter ) వెల్లడించారు.మీ పార్టీ పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం లేదని, ఇకపై రాకూడదని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.ఈ క్రమంలోనే జనసేనానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
అయితే టీడీపీ – జనసేన పొత్తుల( TDP Janasena Alliance ) నేపథ్యంలో జనసేన పార్టీకి 24 సీట్లను టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) కేటాయించిన సంగతి తెలిసిందే.దీంతో ఏపీ వ్యాప్తంగా జనసేన నేతలతో పాటు క్యాడర్ లోనూ తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.







