మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan )”ఆర్ఆర్ఆర్( RRR movie )” సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న విషయం తెలిసిందే.దీంతో ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ ను చరణ్ ఎంజాయ్ చేస్తూనే వరుస సినిమాలను లైనప్ చేసుకుంటూ వెళ్తున్నాడు.
తాజాగా చరణ్ షూటింగ్ గ్యాప్ లో ఉండగా ఈయన ఈ రోజు వేసిన స్వామి మాల తీసాడు.ముంబై లోని వరసిద్ధి వినాయక ఆలయంలో చరణ్ మాల ధారణ తీశారు.

ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.కాగా వీటితో పాటు మరో పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.రామ్ చరణ్ తేజ్ తో ఇండియన్ గేమ్ ఛేంజర్ క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ కలిసి ఫోటో దిగడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.వీరిద్దరూ కలిసి దిగిన పిక్ క్షణాల్లోనే నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లోకి వచ్చేసింది.
నిన్న ధోనీ కొత్త లుక్ వైరల్ అయిన విషయం తెలిసిందే…
మరి ఈ పిక్ ట్రెండింగ్ లో ఉండగానే మరో పిక్ ఇప్పుడు సందడి చేస్తుంది. చరణ్, ధోనీ గతంలోనే 2010లో ఒక యాడ్ కోసం కలిసి మని చేసారు.
మరి మళ్ళీ ఇప్పుడు కలవడంతో మళ్ళీ కలిసి పని చేయబోతున్నారా అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.ఇప్పుడు కూడా వీరు కలిసి యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.దీంతో ఈ విషయం ఫ్యాన్స్ లో ఎగ్జైట్ గా మారింది.

కాగా చరణ్ సినిమాల విషయానికి వస్తే.ప్రస్తుతం రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ ( Shankar ) దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’( Game Changer ) సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ ( Kiara Advani ) హీరోయిన్ గా నటిస్తుంది.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.







