ఐపీఎల్ టైటిల్ కోసం బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ పై దృష్టి పెట్టిన మహేంద్రసింగ్ ధోని..!

ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా వారం రోజులే ఉన్నాయి.ఐపీఎల్ లో టైటిల్స్ కోసం అన్ని జట్లు తమదైన శైలిలో ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి.

 Ms Dhoni Focused On Batting As Well As Bowling For The Ipl Title , Ms Dhoni ,  I-TeluguStop.com

భగభగ మండే సూర్యుని ఎండను సైతం లెక్కచేయకుండా ఎక్కువ సమయం నెట్స్ కే పరిమితం చేసి శ్రమిస్తున్నారు.ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని( MS Dhoni ) ప్రాక్టీస్ చూస్తే, ఈసారి టైటిల్ కచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ కే సొంతం అనిపిస్తుంది.

ఇటీవలే బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న మహేంద్రసింగ్ ఫోటోలు చూసి ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.ఈసారి ధోని బౌలింగ్ చేయనున్నాడా అనే అనుమానాలు అభిమానులలో కలుగుతుంది.

ఏది ఏమైనా ధోని ప్రాక్టీస్ అద్భుతం అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మహేంద్రసింగ్ ధోని బ్యాటింగ్, వికెట్ కీపింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేయడం అందరికీ తెలిసిందే.ఓడిపోయే మ్యాచ్లను బ్యాటింగ్ తో గెలిపించడం.అదే ఫీల్డింగ్ సమయంలో అద్భుతంగా వికెట్ కీపింగ్ చేసి ప్రత్యర్థులను రన్ అవుట్ లేదా క్యాచ్ అవుట్ చేయడం చూశాము.

కానీ గ్రౌండ్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం కాస్త ఆశ్చర్యంగా అనిపించింది.

ధోని బౌలింగ్ ప్రాక్టీస్ వీడియోలు చూసిన అభిమానులు, ధోని ఆడే చివరి ఐపీఎల్ కాబట్టి ఎలాగైనా టైటిల్ చెన్నై సూపర్ కింగ్స్ కు దక్కాలని ఇలా అన్ని విధాల ప్రాక్టీస్ చేస్తున్నాడని భావిస్తున్నారు.ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings ), ఈ ఐపీఎల్ లో కూడా టైటిల్ సొంతం చేసుకోవాలని ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్ ను కొనుగోలు చేసింది.అంతేకాకుండా దీపక్ చాహర్ , రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి రావడంతో జట్టు బలంగా తయారైంది.

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం( Narendra Modi Stadium ) వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ తో ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభం కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube