Mrunal Thakur:ఆ సింగర్ తో ప్రేమలో పడ్డ మృణాల్ ఠాకూర్..నిజమేనా..?

సీతారామం ( Sitharamam ) సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో కలిసి ఫ్యామిలీ స్టార్ అలాగే నేచురల్ స్టార్ నానితో కలిసి హాయ్ నాన్న అనే మూవీలో నటిస్తోంది.ఇక హాయ్ నాన్న ( Hi Nanna ) సినిమా డిసెంబర్ 7న విడుదలకు సిద్ధంగా ఉంది.

 Mrunal Thakur Who Fell In Love With That Singer Is It True-TeluguStop.com

అయితే ఈ మధ్యకాలంలో సైమా అవార్డ్స్ ఫంక్షన్లో అల్లు అరవింద్.నేను ఓ హీరోయిన్ ని తెలుగు అబ్బాయిని చేసుకొని ఇక్కడే సెటిల్ అయిపో అని చెప్పాను.

ఆమె అలాగే చేసింది.ఇప్పుడు నీకు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాను.

నువ్వు కూడా తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకొని టాలీవుడ్ లో సెటిల్ అయిపో అని చెప్పారు.అయితే దీనికి సంబంధించి చాలా వార్తలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

దీంతో నిజంగానే ఏదైనా టాలీవుడ్ హీరో తో మృణాల్ ఠాకూర్ లవ్ లో ఉంది కావచ్చు అందుకే అల్లు అరవింద్ అలా అన్నారు అని భావించారు.

అయితే దీనికి సంబంధించి మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) వీడియో షేర్ చేసి మరీ అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చింది.

అయితే టాలీవుడ్ ఏమో కానీ బాలీవుడ్ వ్యక్తిని పెళ్లి చేసుకొని ఈమె అక్కడ సెటిల్ అవ్వబోతుంది అంటూ తాజాగా ప్రచారం జరుగుతుంది.అయితే దానికి ప్రధాన కారణం మృణాల్ ఠాకూర్ ఆ బాలీవుడ్ ర్యాప్ సింగర్ తో ప్రేమలో పడింది అంటూ నెట్టింట ఒక వార్త చక్కర్లు కొడుతుంది.

ఇక అసలు విషయం ఏమిటంటే.ప్రస్తుతం దీపావళి పండగ జరిగింది.అయితే దీపావళి పండుగ సందర్భంగా చాలా మంది సెలబ్రిటీలు వారింట్లో పండగ సెలబ్రేషన్స్ చేసుకుంటారు.

Telugu Nanna, Mrunal Thakur, Nani, Shilpa Shetty, Sitaramam-Latest News - Telugu

ఇక ఇందులో భాగంగా కొంతమంది సెలబ్రిటీలను కూడా ఆహ్వానిస్తూ ఉంటారు.అయితే బాలీవుడ్ భామ శిల్పా శెట్టి ( Shilpa shetty ) కూడా తన ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ ని గ్రాండ్ ని జరుపుకుంది.ఇక ఈ సెలబ్రేషన్స్ కి కొంత మంది సెలబ్రిటీలతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా పాల్గొంది.

అయితే దీవాలి సెలబ్రేషన్స్ లో మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ ర్యాప్ సింగర్ బాద్ షా తో క్లోజ్ గా ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Telugu Nanna, Mrunal Thakur, Nani, Shilpa Shetty, Sitaramam-Latest News - Telugu

అయితే ఇది అంతా చెప్పుకోదగిన విషయం కాకపోయినప్పటికీ రాప్ సింగర్ బాద్ షా ( Bhad sha ) మృణాల్ ఠాకూర్ ఇద్దరు ఒకరి చెయ్యి పట్టుకుని ఒకరు రావడం, వెళ్లడం అలాగే ఒకే కారులో కలిసి రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఇక ఈ ఒక్క విషయాన్ని పట్టుకొని వేలాడుతున్న నెటిజన్స్ అందరూ మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ ర్యాపర్ ప్రేమలో పడిపోయింది అని వార్తలు వైరల్ చేస్తున్నారు.మరి ఈ వార్తపై మృణాల్ ఠాకూర్ ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube