సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలో స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతూనే మరోవైపు కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం ఇక హీరోయిన్స్ అయితే ఎక్కువగా షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లడం వంటి వాటి ద్వారా భారీ స్థాయిలోనే డబ్బు సంపాదిస్తున్నారు.ఇక హీరోయిన్స్ షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవానికి వెళ్తే కోట్లలోనే రెమ్యూనరేషన్ అందుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ అందరూ కూడా షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవానికి వెళ్తున్నప్పటికీ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) మాత్రం ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవాలకు దూరంగా ఉంటున్నారు.

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అయినటువంటి ఈమె ఎందుకు ఇలాంటి ఓపెనింగ్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు బహుశా యాజమాన్యులు ఆహ్వానించ లేదా అన్న సందేహం అందరిలోనూ ఉంటుంది.అయితే ఈమె మాత్రం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రావాలి అంటే భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్( Remuneration ) డిమాండ్ చేయడంతోనే షాపింగ్ మాల్ యాజమాన్యం దూరం పెట్టారని తెలుస్తుంది.ఈమె నిమిషానికి పది లక్షల రూపాయలు చొప్పున రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

ఈ విధంగా షాపింగ్ మాల్ లో తాను ఎన్ని నిమిషాలు ఉంటే అన్నీ పది లక్షల రూపాయలు చెల్లించాలి.ఇక వీటితో పాటు ఫ్లైట్ టికెట్స్ అలాగే హోటల్ కూడా యాజమాన్యం పెట్టుకోవాల్సి రావడంతో అసలు యాజమాన్యం ఈమెను సంప్రదించడానికి కూడా ఇష్టపడటం లేదని తెలుస్తోంది.ఏది ఏమైనా రిబ్బన్ కటింగ్ కోసం నిమిషానికి లక్షల్లో రెమ్యూనరేషన్ అంటే మామూలు డిమాండ్ కాదు కదా అంటూ ఈ విషయం తెలిసినటువంటి నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈమె ఇటీవల హాయ్ నాన్న సినిమా( Hi Nanna ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.