సామ్, మృణాల్ కలిసి నటిస్తే.. ఈ మల్టీస్టారర్ ను ఆడియెన్స్ ఆదరిస్తారా?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha Ruth Prabhu ) ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా శాకుంతలం(Shaakuntalam) .

పౌరాణిక నేపథ్యంలో భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించిన ఈ సినిమాను ఏప్రిల్ 14న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఈ క్రమంలోనే సమంత కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది.తాజాగా సామ్ ట్విట్టర్ లో ఆస్క్ సెషన్ నిర్వహించింది.

మరి ఈ ఆస్క్ సెషన్ లో యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్, సమంత మధ్య జరిగిన ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) కు తెలుగులో పరిచయం అవసరం లేదు.

ఈమె చేసింది ఒకే ఒక్క సినిమా.సీతారామం( Sita Ramam ) సినిమాలో సీతగా నటించి తెలుగు ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో కట్టి పడేసింది.

Advertisement

మరి ఈ టాలెటెండ్ హీరోయిన్ కు సామ్ కు మధ్య ట్విట్టర్ లో జరిగిన కన్వర్జేషన్ నెట్టింట వైరల్ అయ్యింది.ఆస్క్ సెషన్ లో భాగంగా మృణాల్ ఠాకూర్ తమ ఇద్దరం ఎప్పుడు కలిసి నటిస్తాం అని ప్రశ్న విసరగా సామ్ అందుకు జవాబుగా ఖచ్చితంగా చేద్దాం నీ ఐడియా నాకు నచ్చింది.అంటూ ఆన్సర్ ఇచ్చింది.

దీంతో ఈ సాలిడ్ మల్టీ స్టారర్ కి అయితే ఈ ఇద్దరి ముద్దగుమ్మల నుండి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాల్సిందే.ఇక శాకుంతలం సినిమా విషయానికి వస్తే.ఈ సినిమాలో మేల్ లీడ్ లో దేవ్ మోహన్ నటించాడు.

అల్లు అర్జున్ డాటర్ అల్లు అర్హ కూడా బాలనటిగా పరిచయం కాబోతుంది.పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ మరియు దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!
Advertisement

తాజా వార్తలు