సీతారామం తర్వాత గ్యాప్ రావడానికి అదే కారణం: మృణాల్

హనురాగవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్(Mrunal Thakur) జంటగా నటించిన చిత్రం సీతారామం(Sitaramam).ఈ సినిమా గత ఏడాది ఆగస్టు నెలలో విడుదలై అద్భుతమైన విషయాన్ని అందుకుంది.

 Mrunal Thakur About Long Gap After Sitaramam Movie Details, Mrunal Thakur,sitara-TeluguStop.com

ఇలా ఈ సినిమా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో నటి మృణాల్ కి తెలుగులో ఎంతోమంది అభిమానులు పెరిగి పోయారు.ఇలా ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన ఈమెకు ఇకపై తెలుగులో వరుస అవకాశాలు వస్తాయని ఈమె ఇండస్ట్రీలో బిజీగా మారబోతున్నారని అందరూ భావించారు.

ఇక మొదటి సినిమాని ఇంత మంచి విజయం అందుకున్న తర్వాత ఈమె వరుస సినిమాలతో బిజీ అవ్వడం ఏమోగానీ ఇప్పటివరకు మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు.దాదాపు ఈ సినిమా విడుదల అయ్యి సంవత్సరం అవుతున్న ఈమె తదుపరి సినిమా విడుదలకు నోచుకోలేక పోతుంది.

ఇలాంటి ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమా తీసిన తర్వాత మృణాల్ తన తదుపరి సినిమాని ప్రకటించడానికి ఎందుకంత ఆలస్యం అవుతుందని పలువురు సందేహాలు కూడా వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మృణాల్ ఇలా సీతారామం తర్వాత చాలా గ్యాప్ రావడానికి గల కారణాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ సీతారామం సినిమా మంచి హిట్ అయిన తర్వాత తాను పలువురు స్టార్ డైరెక్టర్లను నిర్మాతలను కలిశానని తెలిపారు.అయితే వారు సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మి(Sita Mahalakshmi) వంటి అద్భుతమైన పాత్రలో నటించిన మీకు అంతకన్నా గొప్ప పాత్ర సిద్ధం చేయాలి అంటే కొంత సమయం పడుతుంది అని చెప్పారు.

అందుకే తన తదుపరి సినిమా రావడానికి ఆలస్యం అవుతుందని ఈ సందర్భంగా మృణాల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ప్రస్తుతం ఈమె నాని(Nani) నటిస్తున్న సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా నాని 30వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది.ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube