మిస్టర్ మజ్ను చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రికార్డు స్థాయిలో దక్కించుకుంటుందని అక్కినేని ఫ్యాన్స్ చాలా నమ్మకం వ్యక్తం చేశారు.
అయితే అఖిల్ మూడవ సినిమా కూడా నిరాశ పర్చింది.మొదటి రెండు సినిమాలు ఆకట్టుకోక పోయినా కూడా అఖిల్ మూడవ సినిమాతో రొమాంటిక్ హీరోగా పేరు దక్కించుకుని చరణ్, ఎన్టీఆర్‌ల సరసన నిలుస్తాడని అంతా భావించారు.
ముఖ్యంగా అక్కినేని అభిమానులు తెగ ఆరాటపడి మరీ మిస్టర్ మజ్ను చిత్రం కోసం ఎదురు చూశారు.తీరా సినిమా వచ్చిన తర్వాత మొత్తం రివర్స్ అయ్యింది.

‘మిస్టర్ మజ్ను’ చిత్రం మొదటి మూడు రోజుల్లో 9 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది.మొదటి రోజు ఒక మోస్తరు వసూళ్లను దక్కించుకున్న నేపథ్యంలో నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు లాంగ్ రన్ లో కనీసం 20 కోట్లు అయినా వసూళ్లు సాధిస్తుందని, నష్టం పెద్దగా ఉండక పోవచ్చు అనుకున్నారు.కాని సోమవారం కలెక్షన్స్ చూసి డిస్ట్రిబ్యూటర్లు మరియు నిర్మాతలు అవాక్కయారు.ఆదివారం పర్వాలేదనిపించిన కలెక్షన్స్ సోమవారం నాటికి దారుణంగా పడిపోయాయి.

సోమవారం తెలుగు రాష్ట్రాల్లో కనీసం 75 లక్షల షేర్‌ను కూడా దక్కించుకోలేక చేతులు ఎత్తేసినట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.శుక్రవారం వరకు ఉంచి ఈ సినిమాను 95 శాతం థియేటర్ల నుండి తొలగించే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది.లాంగ్ రన్ లో ఈ చిత్రం కనీసం 12 కోట్లయినా రాబడుతుందనే నమ్మకం కలగడం లేదని డిస్ట్రిబ్యూటర్లు కన్నీరు కార్చే పరిస్థితి ఉంది.అన్ని ఏరియాల్లో ఈ చిత్రం 23 కోట్ల రూపాయలకు బిజినెస్ చేసింది.
ఇప్పుడు 12 కోట్ల షేర్ అంటే డిస్ట్రిబ్యూటర్లు 11 కోట్ల మేరకు నష్టపోయే అవకాశం ఉంది.







