వికారాబాద్ జిల్లా పరిగిలోని మిని స్టేడియంలో ఏర్పాటు చేసిన ఖేల్ ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో భాగంగా ఖొఖో అకాడమీని చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.ఈ అకడామీ ద్వారా ఆసక్తి గల ఖొఖో క్రీడాకారులకు ఉత్తమ శిక్షణ అందించేలా ఏర్పాట్లు చేశారు.
ఖొఖో అకాడమీ పరిగిలో ఏర్పాటు చేయడంపై ఎంపి రంజిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని ఈ ప్రాంత క్రీడాకారులు ఈ అకాడమీ ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అకాడమీ లో జరిగిన ఖొఖో పోటిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.