MP Ranjeet Ranjan : పుష్ప, యానిమల్ సినిమాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఎంపీ.. హీరోలను అలా చూపించారంటూ?

తాజాగా ఛత్తీస్ గడ్ కు చెందిన ఎంపీ రంజిత్ రంజన్( MP Ranjeet Ranjan ) రాజ్య సభ్యలో పుష్ప, యానిమల్, కబీర్ సింగ్ సినిమాల గురించి పలు అంశాలు లేవనెత్తారు.ఇవి ప్రస్తుతం చర్చకు దారి తీస్తున్నాయి.

 Mp Ranjeeth Ranjan Comments On Animal Movie-TeluguStop.com

ఆ సినిమా లలో హీరోలను విపరీత ప్రవర్తనతో చూపించి, ఆడవాళ్ళ పట్ల అనైతిక ప్రవర్తనలు ప్రేరేపించడం వల్ల దాని ప్రభావం సమాజం మీద పడుతోందని, యువత ఆలోచనలు పెడదారి పట్టే ప్రమాదం ఉంది అంటూ స్పీకర్ ని ఉద్దేశించి సభ్యులందరికీ తన ప్రశ్నలు వినిపించింది.ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

ఆ వాఖ్యలపై ఆయా హీరోల అభిమానులు స్పందిస్తూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Arjun, Animal, Bollywood, Kabir Singh, Mahanati, Pushpa-Movie

మరి ఆమె చెప్పిన విధంగా నిజంగానే సినిమాలు చూసి ప్రజానీకం ప్రభావితం చెందుతారా అంటే దీనికి సమాధానం చెప్పలేని పరిస్థితి.ఎందుకంటె ఉదాహరణగా భారతీయుడు, ఠాగూర్, అపరిచితుడు చూసి ఎవరూ లంచాలు తీసుకోవడం, ఇవ్వడం లాంటివి మానలేదు.మహానటి( Mahanati ) చూసి తాగుడుకి దూరమైన వాళ్ళు ఎందరు.

అలా అని మంచి తీసుకోనంత మాత్రాన చెడుని అంటించుకోరని కాదు.ఆ మధ్య ఢిల్లీలో ఒకడు భార్యని హత్య చేసి ఫ్రిడ్జ్ లో దాచి పెట్టాడు.

ఎలా తట్టిందంటే ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్ చూసి యధాతధంగా దాన్నే ఫాలో అయ్యాడట.ఇలా సినిమాల్లో చూసి అభిమానులను నిజంగానే ఫాలో అవుతారా అంటే అది ఎవరూ చెప్పలేరు.

Telugu Arjun, Animal, Bollywood, Kabir Singh, Mahanati, Pushpa-Movie

కానీ సమాజంలో జరిగే చాలా విషయాలకు సినిమాలకు లింకులు పెడుతూ ఫిలిం మేకర్స్ ని బాధ్యులను చేయడం సరికాదని చెప్పవచ్చు.మంచి చిత్రాలు తీసినప్పుడు ప్రోత్సహించే రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయని అడిగితే ఠక్కున సమాధానం రాదు.పుష్ప ( Pushpa )చూసి ఎవరూ స్మగ్లర్ కారు, యానిమల్ నుంచి బయటికి వచ్చాక ఇంటికెళ్లి ఎవడూ భార్య మీద చేయి చేసుకోడు.ఫాంటసీకి రియాలిటీకి తేడా పబ్లిక్ కి తెలుసు.

ఎంపీ అడగటం బాగానే ఉంది కానీ అంతులేని చర్చకు దారి తీసే ఇలాంటి టాపిక్స్ మీద అంత సులభంగా కంక్లూజన్ కి రావడం అసాధ్యమనే చెప్పాలి.మరి ఎంపీ చేసిన ఆ వ్యాఖ్యలపై ఆయా మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube