యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) నటించిన దేవర మూవీ రిలీజ్ కు మరో నాలుగు నెలల సమయం ఉంది.క్రిస్మస్ పండుగకు ఈ సినిమా నుంచి టీజర్ రిలీజయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
మరోవైపు తారక్ పొలిటికల్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం సోషల్ మీడియాలో తారక్ కు సంబంధించిన ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆ వీడియోలో తారక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ తో స్నేహం గురించి ప్రశ్న ఎదురు కాగా తారక్ అందరితో నాకు తెలిసినంతవరకు మంచిగా ఉంటారని అన్నారు.
నాకు జూనియర్ ఎన్టీఆర్ గురించి కొంచెం వ్యక్తిగతంగా తెలుసని ఆయన వెల్లడించారు.ఈ వీడియో షూట్ జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో( TDP ) ఉన్నారు.
తారక్ ను కలుపుకోవచ్చుగా అనే ప్రశ్నకు స్పందిస్తూ టీడీపీకి, తారక్ కు మధ్య చిన్నచిన్న డిఫరెన్సెస్ ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఒక యాంగిల్ లో ఆలోచన చేస్తారని పార్టీ క్యాడర్ మరో యాంగిల్ లో ఆలోచన చేస్తారని ఆయన కామెంట్లు చేశారు నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కోసమే పని చేస్తానని చెప్పారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.నేను ఎక్కడైనా పోటీ చేసి తారక్ ను ప్రచారానికి పిలిస్తే వస్తాడని ఆయన పేర్కొన్నారు.పార్టీ కోసమైనా చంద్రబాబు( Chandrababu Naidu ) జూనియర్ ఎన్టీఆర్ ను పిలిచి ప్రచారం చేయమంటే నో చెప్పరని తెలిపారు.
రేవంత్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ మధ్య మంచి అనుబంధం ఉందని రేవంత్ రెడ్డి కామెంట్ల ద్వారా అర్థమవుతోంది.ఎన్టీఆర్ దేవర 1 మూవీ( Devara 1 ) 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీన రిలీజ్ కానుంది.దేవర 1 సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది.