ప్రధాని మోదీకి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు.గతంలో తనను అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు కస్టోడియల్ టార్చర్ చేశారని లేఖలో ఆరోపించారు.
విచారణ అధికారులను పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ఇంకా పిలవలేదని చెప్పారు.తనను సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ కొట్టారని ఆరోపించిన ఆయన ఈ అంశంపై త్వరగా విచారణ జరిపించాలని కోరారు.
దీని వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ జరిపి, కఠినంగా శిక్షించాలని కోరారు.







