నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు( Narsapuram MP Raghu Rama Krishnam Raju ) అందరికి సుపరిచితులే.2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది.అయితే వైసీపీ అధిష్టానం( YCP )తో మనస్పర్ధలు రావడంతో ఏడాదిలోనే విభేదించడం జరిగింది.అనంతరం ఢిల్లీలో ఉంటూ రాష్ట్ర రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించేవాళ్ళు.ఇదిలా ఉంటే 2024 ఎన్నికలకు సంబంధించి కొద్ది నెలల ముందు వైసీపీ పార్టీకి రఘురామకృష్ణరాజు రాజీనామా చేశారు.ఆ తర్వాత మూడు పార్టీల కూటమి తరఫున నరసాపురం ఎంపీగా పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటించారు.
కానీ నరసాపురం ఎంపీ టికెట్ రఘురామకృష్ణ రాజుకు దక్కలేదు.
దీంతో కొంత నిరుత్సాహానికి గురైన ఆయన తాజాగా పాలకొల్లు ప్రజాగళం సభలో చంద్రబాబు( Chandrababu ) సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు.ఈ సందర్భంగా రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ గతంలో తాను జైల్లో ఉన్న సమయంలో చంద్రబాబు గారు ఎంతగానో సాయపడ్డారని స్పష్టం చేశారు.ఆయన చొరవ తీసుకోవడం బట్టే తాను ప్రాణాలతో బయటపడినట్లు పేర్కొన్నారు.
జూన్ 4వ తారీఖు చంద్రబాబు ప్రభంజనం సృష్టించబోతున్నారు అని వ్యాఖ్యానించారు.చంద్రబాబుకి తోడుగా పవన్ కళ్యాణ్ ఢిల్లీలో నరేంద్ర మోదీ( Narendra Modi ) . ఈ కూటమి గెలవడానికి మనందరం సైన్యంగా పనిచేయాలని రఘురామకృష్ణ రాజు విజ్ఞప్తి చేశారు.ఇదిలా ఉంటే ఏపీలో జరగబోయే ఎన్నికలలో రఘురామకృష్ణరాజు టీడీపీ ఎమ్మెల్యే( TDP MLA )గా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.