తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ నందిగం సురేష్( MP Nandigam Suresh ) సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబుకి( Chandrababu Naidu ) ఐటి శాఖ నోటీసులు ఇవ్వటంపై ఆయన ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
ఇదే విషయంపై దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎందుకు స్పందించటం లేదని నిలదీశారు.అవినీతి కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు మెడకు ఉచ్చు బిగిసుకుంటుంది.
తప్పించుకునే అవకాశం లేదని వ్యాఖ్యానించారు.ఇందువల్లే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
ఐటీ శాఖ నోటీసులు పంపించడంతో చంద్రబాబు బాగోతం వెలుగులోకి వచ్చిందని అందువల్లే చంద్రబాబు ఐటీ నోటీసులపై నోరు మెదపకుండా తేలు కుట్టిన దొంగలా తప్పించుకొని తిరుగుతున్నారు అని వ్యాఖ్యానించారు.
ఇప్పటికైనా ఆలస్యం కాలేదు.చంద్రబాబు తన తప్పును ఒప్పుకుంటే మంచిదని పేర్కొన్నారు.ఏదైనా సమయం సందర్భం వస్తే తెలుగు వారి ఆత్మగౌరవం అంటూ స్పీచ్ లు ఇచ్చే చంద్రబాబు ఇప్పుడు దానిని ఎక్కడ దాచిపెట్టారో చెప్పాలన్నారు.
బహుశా ఆయనకు భవిష్యత్తు కనిపించి ఉంటుందని స్పష్టం చేశారు.ఇదే సమయంలో నారా లోకేష్( Nara Lokesh ) చంద్రబాబుకు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై స్పందించాలని డిమాండ్ చేశారు.
పాదయాత్రలో పరిపక్వత లేని రాజకీయం చేస్తూ అల్లర్లు గొడవలు సృష్టిస్తున్నారని విమర్శించారు.ఈ క్రమంలో లోకేష్ కూడా ముడుపులు తీసుకున్నారని ఎంపీ నందిగం సురేష్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.