ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొలది రాజకీయం రసవత్తరంగా మారుతోంది.ప్రధాన రాజకీయ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.
ఎన్నికలకు ఇంక మూడు నెలలు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థులు, మేనిఫెస్టో విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇదే సమయంలో టికెట్ దొరకని అభ్యర్థులు ఇతర పార్టీలలోకి జాయిన్ అయిపోతున్నారు.
ఏపీలో గత నెల రోజుల నుండి ఒక పార్టీ నుండి మరొక పార్టీకి జంప్ అవుతున్న నేతల లిస్ట్ పెరుగుతూనే ఉంది.ఈ రకంగానే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలకంగా రాణించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ( MP Kesineni Nani )కొద్ది రోజుల క్రితం వైసీపీలో జాయిన్ అవ్వటానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం తెలిసిందే.
సీఎం జగన్ తో కూడా భేటీ కావడం జరిగింది.ఆ తర్వాత విజయవాడ పార్లమెంట్ ఇన్చార్జిగా కేశినేని నాని పేరును వైసీపీ ప్రకటించింది.
ఇదిలా ఉంటే నేడు ఎన్టీఆర్ వర్ధంతి నేపథ్యంలో..ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఫ్లెక్సీల తొలగింపు వివాదం మీడియాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలకృష్ణ తొలగించారు.
ఈ ఘటనపై తాజాగా ఎంపీ కేశినేని నాని స్పందించారు.జూనియర్ ఎన్టీఆర్ ( Jr ntr )అంటే చంద్రబాబుకి ( Chandrababu )భయం అన్నారు.అందువల్లే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించారు.ఫ్లెక్సీలు తొలగించేందుకు గతంలో ఒక టీం కూడా పనిచేసేదని ఆరోపించారు.తెలుగుదేశంకి ఇవే చివరి ఎన్నికలు.రాష్ట్రం పట్ల చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదు.
కొడుకుని ముఖ్యమంత్రి చేయాలనే తపన తప్ప రెండో ఆలోచన లేదు.తలకిందులుగా తపస్సు చేసిన అధికారంలోకి రాలేరు.
చంద్రబాబు( Chandrababu ) తన తమ్ముడిని పిచ్చోడిని చేశారు.వై నాట్ పులివెందుల అంటున్న చంద్రబాబు దమ్ముంటే చంద్రగిరిలో పోటీ చేయాలని కేశినేని నాని సవాల్ విసిరారు.