సినిమా థియేటర్ లో హిట్ అయ్యింది కదా మళ్లి ఓటిటి లో( OTT ) చూడటానికి ఏముంటుంది చెప్పండి.పోనీ సినిమా ప్లాప్ అయ్యింది.
ఆల్రెడీ ప్లాప్ అయినా సినిమాను కూడా చూడటానికి పెద్ద మ్యాటర్ ఏముంటుంది.ఏదైనా కొత్తగా చూస్తేనే కదా మజా.అది ఇప్పుడు సినిమా మేకర్స్ కి మరియు ఓటిటి వారికి మధ్య జరుగుతున్న అసలు విషయం.సినిమా తీశామా విడుదల చేశామా అని కాదు ఇప్పుడు ఉన్న పరిస్థితులు.
ఏ సినిమా అయినా ఈ రోజు ఉన్న మార్కెట్ రేటు ప్రకారం ఓటిటి నుంచి వచ్చే ఆదాయం చాల పెద్దది.పెద్ద హీరోలకు అయితే 50 నుంచి వంద కోట్ల వరకు మార్కెట్ రేటు( Market Rate ) పెట్టి కొంటున్నారు.
రాజమౌళి( Rajamouli ) లాంటి చిత్రాలకు ఏకంగా 150 కోట్ల రూపాయల వరకు వెచ్చిస్తున్నారు.మరి ఇన్ని కోట్లు పెట్టి నిర్మాతను లాభాల బాట పట్టించే ఓటిటి ఆ సినిమా విజయం సాధించక పోయిన, విజయం సాధించిన లాభాలను మాత్రం ఆర్జించడం లేదు అంటున్నారు.
ఎందుకంటే సినిమా ఒకసారి థియేటర్ లో చూసాక మళ్లి అదే సినిమా చూడటానికి పెద్ద కిక్ ఏం ఉంటుంది.అందుకే ఇప్పుడు మేకర్స్ ( Movie Makers ) తెలివి గా ఆలోచించి వంద కోట్ల రూపాయలను అధిక మొత్తం లో ఇచ్చే ఓటిటి కి కొత్తగా ఏదైనా ఇవ్వాలని భావించారు.దాంతో సినిమా కట్ చేయడానికి ముందు ఉన్న ఎక్కువ సీన్స్ ని కలిపి లేదంటే కొన్ని కొత్త సన్నివేశాలు తీసి వాటిని సినిమాలో జత చేసి ఓటిటి ప్లోట్ ఫార్మ్ కి జత చేస్తున్నారు.ఆలా కొత్త సన్నివేశాల కోసం ప్రేక్షకులు సినిమాను మరోసారి ఓటిటి లో చూస్తారు అనేది మేకర్స్ ఆలోచన.
అలా ఇప్పటికే అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమాను నాలుగు గంటల నిడివితో తీయగా థియేటర్ కి ట్రిమ్ వర్షన్ ఇచ్చి ఓటిటి లో మాత్రం పూర్తిగా విడుదల చేసారు.ఇప్పుడు అదే దోవలో జవాన్( Jawan Movie ) మరియు లియో( Leo Movie ) సినిమాలు కూడా జత చేసిన సీన్స్ తో కలిపి విడుదల చేయబోతున్నారు.ఇలా చేయడం వల్ల ఓటిటి డేంజర్ జోన్ లో పడకుండా చూసుకుంటున్నారు.మరి ఇంత మొత్త డబ్బు వస్తుంటే దర్శకులు మాత్రం ఎందుకు వదులుకుంటారు చెప్పండి.