ఇప్పటి వరకు కాశ్మీర్( Kashmir ) అంటే కేవలం అక్కడి అందాలు మాత్రమే అన్నట్టుగా దర్శకుడు దర్శకులు చూపిస్తూ వచ్చారు.ఎక్కువగా పాటలను కాశ్మీర్ కొండల్లో మంచు పర్వతాల్లో షూటింగ్ చేయడం, వాటి అద్భుతాలను కెమెరాల్లో బంధించడం మన వారికి చాలా అలవాటు.
కానీ ప్రస్తుతం కాశ్మీర్ రాజకీయాల చుట్టూ సినిమాలు( Kashmir Movies ) ఎక్కువవుతున్నాయి.గతంలో కాశ్మీర్ అంటే వేరు ఇప్పుడు చూపిస్తున్న కాశ్మీర్ సినిమాలు వేరు.
కేవలం మణిరత్నం వంటి వాళ్లే కాశ్మీర్ అల్లర్లపై సినిమాలు తీస్తూ వచ్చారు.కానీ ఈ మధ్య కాశ్మీర్ నేపథ్యంలో వస్తున్న సినిమాలు అలాగే రావాలనుకున్న సినిమాల జోరు పెరిగింది.
అందుకు గల కారణాలు గత రెండేళ్ల క్రితం వచ్చిన కాశ్మీర్ ఫైల్స్ సినిమా.ఈ సినిమా విజయవంతం సాధించడంతో చాలా మంది కాశ్మీర్లో ఉన్న రాజకీయాలను వాడుకోవాలని డిసైడ్ అయిపోయినట్టుగా ఉన్నారు.

తాజాగా యామి గౌతమ్, ప్రియమణి కాంబినేషన్లో ఆర్టికల్ 370( Article 370 ) అనే సినిమా రాగా ఇది కూడా మంచి ఓపెనింగ్స్ సాధించింది.ఈ సినిమా విజయవంతం కావడంతో ఆ నేపథ్యంలో వచ్చే సినిమాలు లిస్ట్ పెరిగిపోతోంది.వీటితో పాటు మార్చ్ లో వరుణ్ తేజ్ హీరోగా ఆపరేషన్ వాలెంటైన్( Operation Valentine ) అనే సినిమా రాబోతోంది.2019 లో జరిగిన పుల్వామా అటాక్ దాడి నేపథ్యంలో ఈ సినిమా రాబోతుండడం విశేషం.దీంతో చాలా రోజుల తర్వాత నేరుగా ఒక తెలుగు సినిమా కాశ్మీర్ మరియు అక్కడి దాడులను చూపించబోతోంది.మరోవైపు కమల్ హాసన్ నిర్మాతగా మారి శివ కార్తికేయన్ హీరోగా అమరన్( Amaran ) అను ఒక సినిమా కూడా తీస్తున్నాడు.
ఇది కూడా 2014లో కాశ్మీర్లో జరిగిన యుద్ధం నేపథ్యంలో వస్తున్న సినిమా కావడం విశేషం.

రెండేళ్ల క్రితం వచ్చిన కాశ్మీర్ ఫైల్స్( Kashmir Files ) దేశంలో సంచలనం సృష్టించింది.ఆ తర్వాతే కాశ్మీర్ అల్లర్లపై మన దర్శకులు ఫోకస్ పెంచారు.కేవలం కాశ్మీర్ అంటే అందాలే కాదు అక్కడ రాజకీయాలు కూడా బాగా రసవత్తరంగా ఉంటాయి.
అందుకే అలాంటి పాయింట్ పై సినిమా తీస్తే కాంట్రవర్సీతో పాటు విజయం కూడా దక్కుతుంది.దానివల్లే ఎక్కువగా ఇలాంటి కథలపై ఇప్పటి దర్శకులు ఫోకస్ చేస్తున్నారు.