రామానాయుడు ఇక లేరు

ప్రముఖ నిర్మాత రామానాయుడు నేడు మద్యాహ్నం కన్నుమూశారు.

గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌ వ్యాదితో బాధపడుతూ చికిత్స పొందుతున్న రామానాయుడు గారు నేడు తుది శ్వాస విడిచారు.

తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖుల్లో ఒక్కరైన రామానాయుడు దాదాపు 150కు పైగా సినిమాలు నిర్మించి గిన్నీస్‌బుక్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ రికార్డును సాధించాడు.భారతీయ భాషలు అన్నింటిలో కూడా సినిమాలు నిర్మించిన రామానాయుడు గారు చనిపోవడం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి.

మూవీ మొఘల్‌గా పేరున్న రామానాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్‌ పాల్కే అవార్డు కూడా పొందారు.భారతీయ సినిమాకు ఎంతో సేవ చేసిన ఈయనకు పద్మ అవార్డు కూడా కేంద్రం ప్రధానం చేసింది.

తెలుగులో ఎన్నో మరుపురాని సినిమాలను నిర్మించిన రామానాయుడు గారు 1936 జూన్‌ 6న జన్మించాడు.వెంకటేష్‌ ఇద్దరు కొడుకులు మరియు మనవల్లు కూడా సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతూ వస్తున్నారు.

Advertisement

సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న రామానాయుడు గారు చనిపోవడంతో, తెలుగు సినిమా పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిందని సినీ ప్రముఖులు అంటున్నారు.రామానాయుడు మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన సన్నిహితులు, మిత్రులు ఆయన వద్ద పని చేసిన సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు