సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇలయథలపతి విజయ్ కి ఉండే క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.తెలుగులో వరుస ప్లాప్స్ వచ్చిన పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు.
అలానే తమిళంలో విజయ్ కి కూడా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్( Vijay ) పై ఎన్ని ట్రోల్ల్స్ వచ్చినా ఇండస్ట్రీలో టాప్ లో ఉన్నాడు.
వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.వీళ్ళ సినిమాలు విడుదలైతే ఫ్యాన్స్ కి ఒక పండగే.
ఇక సినిమా పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమాలు కొత్త రికార్డులని సృష్టిస్తాయి.పవన్ కళ్యాణ్, విజయ్ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా.
చాలా సార్లు మీ ఫేవరెట్ హీరో ఎవరు అని విజయ్ ని అడిగితే పవన్ కళ్యాణ్ అని చెప్పారు.మరి ఇంత క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది.
రికార్డులు బద్దలవ్వాల్సిందే.అయితే ఈ కాంబినేషన్ లో ఒక సినిమా మిస్ అయ్యిందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

వీరిద్దరూ ఫ్రెండ్స్ కావడంతో గతం లో ఎస్ జె సూర్య వీరితో ( S.J.Suryah )ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసారంట.ఈ సినిమాకి పవన్ కళ్యాణ్, విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట.
కానీ అదే టైంలో పవన్ కళ్యాణ్ – ఎస్ జె సూర్య కాంబినేషన్ లో కొమరం పులి( Puli ) అనే సినిమా విడుదలైంది.అయితే ఈ సినిమా డిసాస్టర్ అయ్యింది.
భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే నెగటివ్ టాక్ తెచ్చుకుంది.ఆ తరువాత నుంచి ఎస్.జె సూర్య సినిమాలకు దర్శకత్వం చేయడం మానేశారు.దీంతో తరువాత పవన్, విజయ్( Pawan kalyan ) తో కలిసి సినిమా చేయాలన్న ఆలోచనకు బ్రేక్ పడింది.

ఆ తరువాత ఎవరి సినిమాల్లో వారు బిజీ అయిపోయారు.దీంతో ఈ ఇద్దరు కలిసి చేయాల్సిన సినిమా మొదలు కాకుండానే ఆగిపోయింది.మళ్ళీ ఈ ఛాన్స్ వచ్చే అవకాశం లేదు.ఇప్పటికే పవన్ కళ్యాణ్ సినిమాల్లో, రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.ఇక విజయ్ వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు.విజయ్ తరువాత సినిమా లియో.
ఈ సినిమాపై ఇప్పటికే భ్రి అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాకి లోకేష్ దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే త్వరలోనే విజయ్ కూడా రాజకీయాల్లోకి రానున్నారు.తాజాగా విజయ్ మాట్లాడుతూ నేను రాజీకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే సినిమాలు పూర్తిగా ఆపేస్తాను అని కామెంట్స్ కూడా చేసారు.
కాబట్టి వీరి కాంబినేషన్ లో ఇక సినిమా వచ్చే ఛాన్స్ లేదని చెప్పాలి.







