మోటోరోలా ఎడ్జ్ 40నియో స్మార్ట్ ఫోన్ లాంచింగ్, ఫీచర్స్ ఇవే..!

Motorola Edge 40 Neo Smartphone Features Price,Motorola Edge,Motorola Edge 40 Neo,Motorola,Price,Features,Smartphone,New Phone

అనువైన బడ్జెట్లో ఉత్తమమైన ఫోన్లను అందించే బ్రాండ్లలో లెనోవో కు చెందిన మోటోరోలా కూడా ఒకటి.ఈమధ్య కాలంలో ఈ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్లు పెద్ద సంఖ్యలో మార్కెట్లో విడుదల అవుతూనే ఉన్నాయి.

 Motorola Edge 40 Neo Smartphone Features Price,motorola Edge,motorola Edge 40 Ne-TeluguStop.com

ఈ క్రమంలోనే మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.సెప్టెంబర్ 21న భారత మార్కెట్లోకి విడుదల అవ్వనుంది.

ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ధర వివరాలు కంపెనీ ఇంకా ప్రకటించలేదు కానీ స్పెసిఫికేషన్స్ వివరాలు తెలిపింది అవేమిటో చూద్దాం.

మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ 6.55 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ పీఓఎల్ఈడీ డిస్ ప్లే తో వస్తుంది.144 హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ మాలి జీ 77 జీపీయూ, 12 GB RAM+ 256 GB స్టోరేజ్ తో వస్తుంది.ఆండ్రాయిడ్ 13 మైయూఎక్స్ ఓఎస్ తో పని చేస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 50- మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్, 13- మెగాపిక్సెల్ అల్ట్రా- వైడ్ లెన్స్ తో వస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ 68 వాట్ల వైల్డ్ పాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో 500 mAh బ్యాటరీ సామర్థ్యం తో వస్తుంది.హ్యాండ్ సెట్ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది.ఫోన్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ 68 రేటింగ్ తో వచ్చే అవకాశం ఉంది.

డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ చేసే ఫోన్ 5జీ, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ, వైఫై, యూఎస్బీ టైప్-సి కనెక్టివిటీ అందిస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 40నియో స్మార్ట్ ఫోన్ లాంచింగ్, ఫీచర్స్ ఇవే! - Telugu Latest Telugu #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube