తెలుగుదేశాన్ని టీఆర్ఎస్ లో కలిపేయండి..మోత్కుపల్లి

తెలుగుదేశం పార్టీ పరువుని ఎన్టీఆర్ వర్ధంతి రోజున మోత్కుపల్లి హైదరాబాద్ లో మూసీలో కలిపేశారు.ఎన్టీఆర్ 22 వ వర్ధంతి సందర్భంగా ఆయనకీ నివాళులు అర్పించిన మోత్కుపల్లి చద్రబాబు హైదరాబాద్ రాకపోవడాన్ని తప్పుబట్టారు.

 Motkupalli Shocking Comments On Chandrababu-TeluguStop.com

చంద్రబాబు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు…చంద్రబాబు వీలు చూసుకుని కూడా ఎన్టీఆర్ ఘాట్ కి రాకపోవడం దేనికి నిదర్సనం అని ప్రశ్నించారు.తెలంగాణలో ఇప్పటికే తెలుగుదేశం లేదనే ప్రచారం జరుగుతోందని చంద్రబాబు ఈ విషయాన్ని ఇప్పుడు నిజం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మోత్కుపల్లి.

తెలంగాణలో టిడిపి ఎంతో గడ్డు పరిస్థితులో ఉంటే చంద్రబాబు కిమ్మనకుండా కూర్చోవడం అంతవరకూ సబబు నటు వ్యాఖ్యానించారు.ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం మరింతగా తెలంగాణలో పార్టీని కాపాడుకోవాలని అన్నారు.

అయితే ఎన్టీఆర్ ఘాట్ ఇక్కడ ఉంది కాబట్టి చంద్రబాబు ఓ నిమిషం పాటు అయినా వస్తే బాగుండేది కానీ చంద్రబాబు రాకపోవడం కరెక్టు కాదు అంటూ డైలాగులు పేల్చారు మోత్కుపల్లి…ఎన్టీఆర్ తెలంగాణలోనే పార్టీ ప్రారంభించారు అలాంటిది తెలంగాణలో తెలుగుదేశం అంతరించి పోయే పరిస్థితికి వచ్చింది అని అన్నారు

అయితే మోత్కుపల్లి మరి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.కెసీఆర్ కూడా మన పార్టీ నుంచి పోయిన వ్యక్తే.

మన పార్టీ నుంచి రూపుదిద్దుకున్న నాయకుడే…తెలంగాణ మంత్రులు కూడా మన వాళ్లే…40లక్షల ఓటర్ దేవుళ్ళను కాపాడుకోవాలి.మీరిద్దరూ అన్నదమ్ముల్లా ఉంటూ టీఆర్ఎస్ లో విలీనం చేయగలిగితే గౌరవంగా ఉంటుందనే నా అభిప్రాయం.

అంటూ మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి.అంతేకాదు ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి.

తెలంగాణలో తెలుగుదేశాన్ని బ్రతికించి ఎన్టీఆర్ ఆత్మ కి శాంతి చేకూర్చాలి అంటే టీఆర్ఎస్ లో విలీనం చేయటం ఒక్కటే దారి అని మోత్కుపల్లి అన్నారు… లేదంటే చంద్రబాబు స్వయంగా రథం వేసుకుని తిరిగి పార్టీని తిరిగి పట్టాలపైకి తేవాల్సిన అవసరం ఉంది…అది అసంభవం అంటూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు.అయితే ఇప్పుడు మోత్కుపల్లి నిజంగానే తనకి తానుగా వ్యాఖ్యలు చేశారా.

లేక చంద్రబాబు వేసిన ప్లాన్ నా అని అందరు చర్చించుకుంటున్నారు.మరి ఈ వ్యాఖ్యలు ఎటువంటి పరిస్థితులకి దారి తీస్తాయో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube