కోడి పందాలలో కోట్లు పోగొట్టుకున్న తెలంగాణా మంత్రి

కోడిపందాల కోసం అని ఆంధ్రప్రదేశ్ వెళ్లి కోట్లు పోగొట్టుకున్నారు తెలంగాణా మంత్రి.ఒకటి రెండు కాదు ఏకంగా 10 కోట్లు పోగొట్టుకున్నారు.

 Telangana Minister Loss 10cr In Ap Cock Fights-TeluguStop.com

ఎలా పోగొట్టుకున్నారు.ఎందుకు.? ఏమిటి.? ఎలా.? తెలుసుకోవాలి అంటే ఈ స్టొరీ చదవాల్సిందే వివరాలలోకి వెళ్తే.

అంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ అంటేనే ఎంతో సంబరాలు చేసుకుంటారు.

చిన్నా పెద్దా అందరు కలిసి ఎంతో సరదాగా గడిపే ఒకేఒక్క పండుగ సంక్రాంతి…అయితే విదేశాలలో ఉండే వారు సైతం ఈ పండుగకి తరలి వస్తారు సొంత ఊర్లకి.అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే కాదు పక్క రాష్ట్రాలలో ఉన్న ప్రజలు నాయకులు సైతం కూడా ఈ కోడి పందాలు ,సంక్రాంతి సబరాలు చూడటానికి వేలల్లో వస్తారు అయితే తెలంగాణా రాష్ట్రం నుంచీ కూడా అధికార పార్టీకి చెందినా ఓ మంత్రి ప్రతీ ఏటా ఈ పండుగకి వచ్చి కోడి పందాలాలో పాల్గొంటారు.

ఇందులో వింతేముంది అనుకుంటున్నారా అసలు విషయం ఏమిటంటే.

భారీ స్థాయిలో ఇక్కడ జరిగే కోడి పందాలలో కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతాయి.

ఎంతో మంది జేబులు గుల్ల చేసుకుంటారు కూడా.అయితే ఆ లిస్టులో తెలంగాణా మంత్రి కూడా చేరిపోయారు.

ఏకంగా ఆ మంత్రి 10 కోట్లు పోగొట్టుకోవడం పెద్ద చర్చకి దారి తీసింది.సదరు మంత్రి తెలంగాణా రాష్ట్రం ఏర్పడక ముందు టిడిపిలో ఓ వెలుగు వెలిగారు కూడా.

ఇప్పుడు టీఆర్ఎస్ లో మంత్రి పదవులు చేపట్టారు.అయితే ఈ మంత్రికి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భంధువులు ద్వారా ఏపీలో జరిగే కోడిపందాలకి వస్తు ఉంటారు.

అయితే ఈ సారి కోడి పందాలలో సుమారు 15 కోట్లు రూపాయలు పెట్టగా దాదాపు 10 కోట్లు పోయాయని సమాచారం అయితే ఇదే విషయంపై సదరు మంత్రిని మిగిలిన మంత్రులు అడుగగా.పందాలు అన్నాక గెలుపు ఓటములు సహజం అయినా ఎప్పుడు డబ్బులు దండిగానే వచ్చేవి ఈ సారి మాత్రం పోయాయి మనకి డబ్బులు ముఖ్యం కాదు గెలుపు ఓటములు ముఖ్యం అని తెలిపారట.

అదీ కోట్లు పోగొట్టుకున్న మంత్రి గారి స్టొరీ.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube