వైరల్: చిన్నారిని కాపాడేందుకు తల్లి సాహసం ..!

చిన్నపిల్లలకు బొమ్మలతో ఆడుకోవడం, జంతువులతో కలిసి ఆడుకోవడం సరదా.ఆ వయసులో వారికి జంతువుల గురించి అంతగా తెలియదు.

 Mother Saves Curious Toddler From Backyard Bear In Seattle Suburb Details, Viral Latest, News Viral, Social Media, Viral Video, Mother, Kid, Mother Saves Child, Bear, Bear In Backyard, Toddler, Brave Mother, Usa, Washington-TeluguStop.com

అందుకే టీవీ లో ఏదైనా వింత జంతువు కనపడినా దాన్ని అలానే చూస్తుంటారు.ముఖ్యంగా వారు పెంపుడు కుక్కలతో ఆదుకోవడం మనం చూస్తుంటాం.

ఇంట్లో ఒక జంతువు ఉండటం మనకు మరపురాని క్షణాలు ఇస్తుందనడంలో సందేహం లేదు.ముఖ్యంగా పిల్లలు మరియు జంతువుల గురించి మాట్లాడేటప్పుడు, వారి మధ్య చాలా ప్రత్యేకమైన బంధం ఏర్పడుతుంది.

 Mother Saves Curious Toddler From Backyard Bear In Seattle Suburb Details, Viral Latest, News Viral, Social Media, Viral Video, Mother, Kid, Mother Saves Child, Bear, Bear In Backyard, Toddler, Brave Mother, Usa, Washington-వైరల్: చిన్నారిని కాపాడేందుకు తల్లి సాహసం ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే.పిల్ల‌ల‌కు క్రూర జంతువుల నుండి ప్రాణ‌హాని ఉంటుంద‌ని తెలియక, వాటితో ఆడుకోవాల‌ని చూస్తారు.ఇలాంటి సంఘటనే ఒకటి యూఎస్‌లో చోటుచేసుకుంది.ఓ చిన్నారి ఎలుగుబంటి క‌నిపించ‌గానే దాన్ని వాటేసుకునేందుకు ప‌రుగెత్తింది.ఇది గ‌మ‌నించిన త‌ల్లి. పరిగెత్తుకు వెళ్లి తన ప్రాణాల‌కు తెగించి ఆ చిన్నారిని కాపాడింది.హీరో మామ్‌గా ప్ర‌శంస‌లు అందుకుంటున్న‌ది.ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ఈ వీడియోని గమనిస్తే.వాషింగ్ట‌న్‌లోని ఓ ఇంటి వెనుక‌ గోడ పై నుంచి ఎలుగుబంటి ఇంటి దగ్గరకు వ‌చ్చింది.దాన్ని చూసిన చిన్నారి, ఎలుగుబంటి వ‌ద్ద‌కు ప‌రుగెత్తింది.గ‌మ‌నించిన త‌ల్లి సాహ‌సం చేసి, చిన్నారిని ర‌క్షించింది.

డోర్‌లోపలికి పరిగెత్తుకుంటూ వ‌చ్చి, డోర్ లాక్ చేసేసింది.ఇదిలా ఉండ‌గా, త‌న కూతురు ఇటీవ‌లే యానిమ‌ల్ బుక్ చ‌దివింద‌ని, త‌న ఫేవ‌రెట్ యానిమ‌ల్ ఎలుగుబంటి అని చెప్పింద‌ని ఆ త‌ల్లి పేర్కొంది.క్రూర జంతువుల గురించి త‌న‌ కూతురికి వివ‌రిస్తాన‌ని చెప్పింది.కాగా, ఈ వీడియో టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేయ‌గా, 3.2 మిలియ‌న్ల మంది వీక్షించారు.ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శ్రేణిలో కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియో అక్కడి సెక్యురిటీ కెమెరాలో రికార్డ‌య్యింది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube