దుబాయ్‌లో ఒక ఇల్లు అమ్మకానికి ఉంది.ఆ ఇల్లు దుబాయ్‌లో అత్యంత ఖరీదైనదిగా గుర్తింపుపొందింది.ఈ ఇంటి ధర ఎంత రూ.500 కోట్లపైమాటే. దుబాయ్‌లో విక్రయించే ఈ ఇంటి ధర 280 మిలియన్ దిర్హామ్‌లు. దీనిని భారతీయ కరెన్సీలోకి మార్చినట్లయితే, దాని విలువ దాదాపు రూ.580 కోట్లు.అవును.ఈ ఇంటిని కొనుగోలు చేయాలంటే రూ.580 కోట్లు కావాలి.ఇంతకుముందు దుబాయ్‌లోని మరో ఇల్లు అత్యంత ఖరీదైన ఇల్లుగా గుర్తింపు పొందింది.కానీ ఇప్పుడు ఈ ఇల్లు ఆ రికార్డులను బద్దలు కొట్టింది.ఈ ఇంటి ధర రూ.350 కోట్లు.ఇది 2015వ సంవత్సరంలో విక్రయమయ్యింది.ఈ విల్లా అత్యంత విలాసవంతమైనది.
ఈ విలాసవంతమైన విల్లా దుబాయ్‌లోని పామ్ జుమేరాలో నిర్మితమయ్యింది.ఇక్కడ నుండి సముద్రం కనిపిస్తుంది.
ఈ స్థలాన్ని చూడటానికి, పర్యాటకులు ఇతర దేశాల నుండి దుబాయ్‌కి తరలివస్తుంటారు.ఈ ఇల్లు దుబాయ్‌లో అత్యంత ప్రధానమైనది.
అందమైన ప్రదేశంలో నిర్మితమయ్యింది.గాజుతో నిర్మితమైన ఈ ఇల్లు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది.
ఈ వైట్ విల్లా 33 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యింది.ఈ భవనంలో 70 మీటర్ల ప్రత్యేక ప్రైవేట్ బీచ్ ఫ్రంట్ రూపొందించారు.

ఇది ఈ విల్లాను మరింత ప్రత్యేకంగా మార్చింది.ఈ భవనం విభిన్న అనుభవాన్ని ఇస్తుంది.ఇది 10 పడక గదుల కస్టమ్ బిల్ట్ విల్లా.ఈ భవనం విలాసవంతమైన నివాస స్థలాన్ని కలిగి ఉంది.ఇంతేకాకుండా, ఈ భవనంలో స్పా, జిమ్, హెయిర్ సెలూన్ వంటి సౌకర్యాలతో పాటు ఇటాలియన్ మార్బుల్స్ అణువణువుగా కనిపిస్తాయి.భవనంలో ఇటాలియన్ ఫర్నిచర్ కనిపిస్తుంది.
ఖరీదైన ఇళ్ల విషయంలో దుబాయ్, లండన్, న్యూయార్క్, హాంకాంగ్‌లు ముందుంటాయి.







