బీహార్లో మహాకూటమి విజయం సాధించడం సంతోషంగానే ఉన్నా మరో పది రోజుల్లో నితీష్ కుమార్కు అసలైన తలనొప్పి ప్రారంభం కాబోతున్నది.ఈ నెల 20వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అనుకుంటున్నారు.
మహాకూటమిలో జేడీయూతో పాటు లాలూ పార్టీ ఆర్జేడీ, సోనియా గాంధి పార్టీ కాంగ్రెస్ భాగస్వాములు కాబట్టి ఆ పార్టీల వారికి పదవులు ఇవ్వాలి కదా.అసలు కథ ఇక్కడే మొదలవుతుంది.కూటమిలోని నితీష్ పార్టీ కంటే లాలూ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి.వాస్తవానికి లాలూ ముఖ్యమంత్రి పదవి కోసం డిమాండ్ చేయవచ్చు.కానీ నితీష్ కుమార్ని ముందుగానే సీఎమ్ అభ్యర్థిగా ప్రకటించడం, తాను ముఖ్యమంత్రి పదవి కోరుకోవడం లేదని లాలూ ప్రకటించడంతో మహా కూటమికి ఓట్లు పడ్డాయి.ముఖ్యమంత్రి పదవి యోగం లేని లాలూ తన పార్టీకి ఎక్కువ మంత్రి పదవులు అందులోనూ కీలకమైన పదవులు కావాలని డిమాండ్ చేసే అవకాశం కనబడుతోంది.
ఆయన పార్టీకి ఎక్కువ సీట్లు రావడం కూడా ఇందుకు కారణం.లాలూ మాదిరిగా కాంగ్రెస్ డిమాండ్ చేయకపోయినా ప్రాధాన్యం ఉన్న పదవులే అడగవచ్చు.
కాంగ్రెస్ పార్టీకి ఉప ముఖ్యమంత్రిగానీ, స్పీకర్ గానీ ఇవ్వవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి.లాలూ ఇద్దరు కుమారులు ఎన్నికల్లో గెలిచారు.
వారు పోటీ చేయడం ఇదే మొదటిసారి.ఇద్దరికీ పదవులు ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇద్దరికీ ఇవ్వడం కుదరకపోతే ఒక్కరికి గ్యారంటీ.ఎన్నికల వరకు నితీష్ -లాలూ దోస్తీ విజయవంతమైంది.
పదవుల పంపిణీ విషయంలో ఈ సామరస్యం ఉంటుందా ?