యూఎస్ కాంగ్రెస్ ఎన్నికల రేసులో మరింత మంది భారత సంతతి అభ్యర్ధులు ..?

అమెరికన్ రాజకీయాల్లో భారతీయుల హవా పెరుగుతున్న సంగతి తెలిసిందే.కౌన్సిలర్లు, మేయర్లు, సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు, దేశ ఉపాధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు.ఎప్పటికప్పుడు భారత సంతతి అభ్యర్ధుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.2024లో జరగనున్న యూఎస్ కాంగ్రెస్( US Congress ) ఎన్నికల రేసులోనూ మరింత మంది భారతీయ అభ్యర్ధులు( Indians ) నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.అమీబేరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్‌, శ్రీ థానేదర్‌లు యూఎస్ కాంగ్రెస్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న భారత మూలాలున్న వ్యక్తులు.

 More Indian Americans To Join Race For Us Congress In 2024 Details, Indian Ameri-TeluguStop.com

అమీబేరా (57)( Ami Bera ) వీరందరిలోకి సీనియర్.

ఆయన కాలిఫోర్నియాలోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి , కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెషనల్ జిల్లా నుంచి రో ఖన్నా (46)లు( Ro Khanna ) ప్రాతనిథ్యం వహిస్తున్నారు.రాజా కృష్ణమూర్తి (49)( Raja Krishnamoorthi ) ఇల్లినాయిస్‌లోని 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి , ప్రమీలా జయపాల్ (57)( Pramila Jayapal ) వాషింగ్టన్‌ లోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి సేవలందిస్తున్నారు.

అమెరికా పార్లమెంట్ లోపల భారత సంతతికి చెందిన ఎంపీల గ్రూప్‌ను సమోసా కాకస్‌గా వ్యహరిస్తున్నారు.భారతీయ వంటకమైన సమోసాకు ప్రపంచవ్యాప్తంగా వున్న ఆదరణ కారణంగా.ఈ గ్రూప్‌కు విశేషమైన ఆదరణ దక్కింది.

Telugu Ami Bera, Democratic, Kamala Harris, Pramila Jayapal, Ro Khanna, Samosa C

అలాగే మరో 50 మంది భారత సంతతి సభ్యులు రాష్ట్ర శాసనసభలలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు.రాబోయే రోజుల్లో ఇది మరింత విస్తరించాలని ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు.సమోసా కాకస్‌కు( Samosa Caucus ) ముందు 1965లో దలీప్ సింగ్ సౌండ్ అమెరికా ప్రతినిధుల సభలో అడుగుపెట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

ఆ తర్వాత 2004లో పీయూష్ బాబీ జిందాల్, 2012లో అమీబెరాలు ఈ ఘనత అందుకున్నారు.

Telugu Ami Bera, Democratic, Kamala Harris, Pramila Jayapal, Ro Khanna, Samosa C

2016లో కమలా హారిస్.( Kamala Harris ) సెనేట్‌కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్‌గా, అమెరికా ఉపాధ్యక్షురాలైన తొలి మహిళగా, తొలి దక్షిణాసియా వాసిగా చరిత్ర సృష్టించారు.అమెరికా జనాభాలో దాదాపు 2 శాతంగా వున్న భారతీయ అమెరికన్లు యూఎస్ కాంగ్రెస్‌లో 1 శాతం ప్రాతినిథ్యం వహిస్తుండగా, వీరంతా డెమొక్రాటిక్ పార్టీకి( Democratic Party ) చెందినవారు కావడం విశేషం.

వచ్చే ఏడాది జరగనున్న యూఎస్ కాంగ్రెస్ ఎన్నికల్లో మరింత మంది ఇండో అమెరికన్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీల నుంచి వీరు పోటీ చేసే అవకాశం వుంది.

ప్రస్తుతానికి వారి పేర్లు బయటకు రానప్పటికీ, ఈసారి భారతీయుల సౌండ్ గట్టిగానే వినబడుతుందని విశ్లేషకులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube