ఆ ఒక్క డైలాగ్‌తో వకీల్ సాబ్ ఎక్కడికో వెళ్లిపోతాడట!

Monologue Dialogue To Be Highlight Of Vakeel Saab, Vakeel Saab, Pawan Kalyan, Venu Sriram, Dil Raju

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.

 Monologue Dialogue To Be Highlight Of Vakeel Saab, Vakeel Saab, Pawan Kalyan, Ve-TeluguStop.com

రెండేళ్ల తరువాత పవన్ వెండితెరపై కనిపించేందుకు సిద్ధమవుతుండటంతో, ఆయన సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఉన్నారు.ఇక బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా వస్తున్న వకీల్ సాబ్ చిత్రంలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే అంశాలు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ లుక్‌తో పాటు ఆయన చెప్పే డైలాగులు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడం ఖాయమని తెలుస్తోంది.ఈ క్రమంలో కోర్టు సీనులో పవన్ చెప్పే ఓ పవర్‌ఫుల్ డైలాగ్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనుందట.

ఈ సింగిల్ టేక్ డైలాగ్‌తో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ రావడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.ఈ డైలాగును పవన్ చెప్పే విధానం చూసి ప్రేక్షకులు అవాక్కవ్వడం ఖాయమని, వారు ఈ సినిమా చూసిన తరువాత గర్వంగా ఫీల్ కావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

మొత్తానికి వకీల్ సాబ్ చిత్రంతో పవన్ ఈసారి అదిరిపోయే ఫీస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడని చిత్ర యూనిట్ అంటోంది.

పవన్ లాయర్ పాత్రలో నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రంలో నివేదా థామస్, అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా, ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఏదేమైనా వకీల్ సాబ్ చిత్రంతో పవన్ మరోసారి అదరగొట్టేందుకు రెడీ అవుతుండటంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube