వైరల్: ఈ కోతికి న్యూస్ పేపర్ చదవనిదే తెల్లారదట.. చూడండి ఎలా తిరగేస్తుందో!

నేటి సోషల్ మీడియా ప్రపంచం అనేది ఎన్నో వింతలూ విశేషాలు అద్భుతాలతో కూడుకొన్న ప్రపంచం అని పొద్దొస్తమానం ఇంటర్నెట్లో మునిగితేలుతున్న మనందరికీ తెల్సిందే.ఇందులో షేర్ చేయబడిన సందేశాలు, ఫోటోలు, వీడియోలకు మంచి గిరాకీ ఉంటుంది, అదేనండి బాగా వైరల్ అవుతుంది.

 Monkey Reading News Paper Video Viral Details, Monkey, Social Media, Viral Video-TeluguStop.com

ఉపయోగకరమైన సమాచారంతో కూడిన వినోదాత్మక మార్గం సోషల్ మీడియా అని చెప్పుకోవచ్చు.ఇంటర్నెట్‌లో షేర్ చేయబడిన వీడియోలు మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొంటున్న టెన్షన్ నుండి కాస్త రిలాక్స్ అవ్వడానికి దోహదపడతాయి అని చెప్పుకోక తప్పదు.

ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమధ్య కాలంలో చూసుకుంటే జంతువులకు సంబంధించి ఎక్కువ వీడియోలు వైరల్ అవుతున్నాయి.అందులోనూ కోతులకు సంబంధించిన వీడియోలు అయితే మరింత ఎక్కువగా వైరల్‌ అవుంటాయి.మానవులు చేసే అనేక పనులను చేయగలిగిన జంతువులలో కోతులు ఒకటి.తాజాగా ఓ పెంపుడు కోతికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.ఈ వీడియోని గమనిస్తే ఓ వ్యక్తి సోఫాలో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్నాడు.ఇంకా కొన్ని వార్తాపత్రికలు సోఫాలో పడి ఉన్నాయి.

అయితే అక్కడే సోఫాలో కూర్చున్న కోతి అతన్ని అనుసరిస్తూ… అతనిలాగే పేపర్లు చదవడానికి ఆసక్తి చూపుతుంది.ఆకోతి ఒక్కో పేపర్ తిరగేస్తూ ఏదో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ కోసం వెతుకుతున్నట్టుగా పేపర్‌ అటు తిప్పి ఇటు తిప్పి చూస్తుంది.కాగా ఈ దృశ్యం చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో జంతువులు_బీయింగ్_ఎపిక్ అనే ఖాతా షేర్ చేయగా ఈ వీడియో వెలుగు చూసింది.మనుషులు చేసే చాలా పనులు కోతులు చేయగలవు అని ఒకరు కామెంట్ చేస్తే, కోతి చాలా తెలివైన జంతువు.దానికి ఈ వీడియో ఉదాహరణ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube