కోతుల నుంచే మనుషులు ఉద్భవించారని చరిత్ర బలంగా వాదిస్తోంది.అందుకే కాబోలు కొన్నిసార్లు మనిషులు కూడా కోతుల్లా మారి ప్రవర్తిస్తుంటారు.
ఇలాంటి ఘటనలు మనం ఇది వరకు చాలానే చూశాం.కానీ ప్రస్తుత రోజుల్లో కోతులు కూడా చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాయి.
వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతోంది.అలాగే ఓ జూలో కోతి వేసిన చేష్టలు చూసి అంతా ముక్కున వేలేస్కుంటున్నారు.
అయితే ఉక్రెయిన్ దేశంలోని ఱార్కివ్ లో గల జంతు ప్రదర్శన శాలలో ఉండే ఒక వానరం చేసిన చేష్టలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.ఆ వానరం చాకచక్యంగా జూ నుంచి తప్పించుకుంది.
కొన్నాళ్ల పాటు నగరంలోనే తిరిగింది.
అయితే ఈ కోతి నగరంలో తిరుగుతున్నప్పుడు వేసిన వేషాలన్నింటిని నగర వాసులు వీడియోలు తీసి నెట్టింట షేర్ చేశారు.
ఇవన్నీ తెగ వైరల్ అయ్యాయి.అయితే ఆ కారు పోతి చీచీ.
జూ పార్కుపై బాంబు వేసిన తర్వాత అది చాలా కష్టపడి అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చింది.కానీ బయట ప్రపంచంలో ఎక్కువ రోజుల ఉండలేక నానా ఇబ్బందులు ఎదుర్కుంది.
చీచీ బాధను అర్థం చేసుకున్న ఒకామె దానికి వెచ్చని జాకెట్ ఇవ్వగా వేసుకొని తిరిగింది.అంతేనా మహిళకు హగ్ ఇచ్చి తన బాషలో థాంక్స్ కూడా చెప్పింది.
అయితే చీచీని గుర్తించిన జూ సిబ్బంది దాన్ని సైకిల్ పై కూర్చోబెట్టుకొని తీసుకెళ్లారు.