ఓ విషయంలో బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థులు వణికిపోతున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలలు ముందుగానే కెసిఆర్( CM kcr ) అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో, టికెట్ దక్కించుకున్న వారు పూర్తిగా జనాల్లో తిరుగుతూ, నియోజకవర్గంలో తమ పట్టు పెంచుకునే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు .
నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటూ ప్రజలకు దగ్గరయ్యేందుకు చూస్తున్నారు.అయితే రాబోయేది పండుగ సీజన్ కావడంతో, బీఆర్ఎస్ అభ్యర్థులకు కొత్త టెన్షన్ మొదలైంది .గణేష్ నవరాత్రులతో పాటు, బతుకమ్మ , దసరా, దీపావళి పండుగలు ఉండడంతో, వాటి కోసం భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.నియోజకవర్గంలో ప్రతి చోట నిర్వహించే ఈ ఉత్సవాలకు భారీగా సొమ్ములు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
సొమ్ములను ఖర్చు చేయకపోతే ప్రజల్లో చులకన అవుతామనే భావన కూడా ఉండడంతో, ముందు ముందు పెట్టల్సిన ఖర్చుని తలుచుకుని బీఆర్ఎస్( BRS ) అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు.
దీనికి తోడు ఎన్నికల వరకు కేడర్ కు అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చడంతో పాటు, కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఎన్నికలకు ముందుగా ఖర్చుకు వెనకాడితే జనాల్లో చులకన అవుతామనే భావన ఉంది.పండుగల నిమిత్తం చేసే ఖర్చు కాకుండా, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది.
దీంతో ఇప్పటి నుంచే సొమ్ముల వేట మొదలుపెట్టారు బీఆర్ఎస్( BRS party ) అభ్యర్థులు.ఒకవైపు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే , మరోవైపు సొమ్ములను సమకూర్చుకునే పనుల్లో నిమగ్నమయ్యారు.
ఈ మేరకు తమకున్న స్థిర, చర ఆస్తుల అమ్మకాలు , అప్పులు తీసుకోవడం, విరాళాలు ఇలా అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు.ఎన్నికల నోటిఫికేషన్ ముందుగానే భారీగా సొమ్ము ఖర్చు పెట్టాల్సి ఉండడం, అది తమ ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారం కావడంతో అభ్యర్థులు నిధుల వేటలో నిమగ్నమయ్యారు.ఎన్నికలు ముగిసే వరకు చేయాల్సిన్ ఖర్చును తలుచుకుని టెన్షన్ పడిపోతున్నారు.